తమిళులంతా తలైవా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయం వైపుగా వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తున్నారని స్పష్టమవుతోంది. ఇటీవల తన అభిమానులతో ఫొటో సెషన్ ను ఏర్పాటు చేసిన రజనీ... దానిని రోజుల తరబడి నిర్వహించారు. తన అభిమానులతో చర్చలు నిర్వహించేందుకే రజనీకాంత్ ఈ ఫొటో సెషన్ ను ఏర్పాటు చేసినట్లు నాడు వార్తలు వినిపించాయి.
తమిళనాట జయలలిత శకం ముగిసిన దరిమిలా రాజకీయ శూన్యం ఏర్పడిందన్న భావన ఉంది. జయ మరణించాక... వివిధ పరిణామాల క్రమంలో ఆమె నెచ్చెలి శశికళ జైలుకు వెళ్లడం - జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వం పదవి నుంచి దిగిపోవడం, పళనిస్వామి సీఎం కావడం, శశికళ మేనల్లుడు దినకరన్ పార్టీతో పాటు సీఎం పదవి కోసం చేస్తున్న యత్నాలు... ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగానూ ఆసక్తి కలిగించాయి. సమర్థవంతమైన నేత లేని కారణంగానే తమిళనాట ఈ తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న విశ్లేషణలు లేకపోలేదు.
ఈ క్రమంలో కొందరు సన్నిహితుల సూచన మేరకు రాజకీయాల వైపు చూసిన రజనీకాంత్... ఆ దిశగా ఇప్పుడు వడివడిగానే అడుగులు వేస్తున్నారు. మొన్న అభిమానులతో ఫొటో సెషన్ ను ఏర్పాటు చేసిన ఆయన తాజాగా అన్నదాతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమిళనాడుకు చెందిన కొందరు రైతులను చెన్నైకి పిలిపించిన రజనీకాంత్... వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సాగులో ఎదురవుతున్న ఇబ్బందులపై వారితో ఆరా తీశారు.
అన్నదాత కష్టాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగినట్లు సమాచారం. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న రైతులకు ఇప్పటికిప్పుడు ఎలాంటి సాయం కావాలని కూడా రజనీ అడిగినట్లు తెలుస్తోంది. ఈ తరహా వివరాలన్నీ సేకరించిన రజనీ... రైతుల సంక్షేమం కోసం తనవంతుగా రూ.1 కోటిని అందజేయనున్నట్లుగా రైతులకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా మున్ముందు కూడా రైతులకు అండగా ఉంటానని ఆయన వారికి భరోసా ఇచ్చారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/