భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయడాన్ని ఒక్క తమిళనాడు తప్ప మిగతా అంతా ఖండించారు. 30 ఏళ్లు దాటినా కూడా వారు ఒక ప్రధానిని హత్య చేసినందుకు జీవితఖైదు విధించాలన్న డిమాండ్లు వినిపించాయి. కానీ దోషులను సుప్రీంకోర్టు విడదల చేసింది. ఈ దోషులు విడుదలైన పది రోజుల తర్వాత రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తాజాగా సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది. హంతకులను విడుదల చేయడం "దురదృష్టకరమని.. "ఆమోదయోగ్యం కాదు" అని వాదిస్తోంది.
తమిళనాడుకు చెందిన ఒక మహిళతోసహా ఆరుగురిని జైలు నుంచి విడుదల చేసిన తర్వాత, ఈ ఉత్తర్వును సమీక్షించాలని కోరుతూ కేంద్రం కూడా శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. "కేంద్ర ప్రభుత్వం యొక్క సమీక్ష దరఖాస్తులో మేము జోక్యం చేసుకుంటామా లేదా లేకపోతే జోక్యం చేసుకోవాలా అనే దానిపై మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అని పార్టీ సీనియర్ నాయకుడు ,న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పారు.
ఈ ఉద్వేగభరితమైన రాజకీయ అంశంలో బిజెపి పాలిత కేంద్రం, కాంగ్రెస్ రెండూ కూడా రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయవద్దంటూ ఒకే వైపు నిలిచాయి. దోషుల విడుదలకు తగిన విచారణ ఇవ్వకుండానే క్లియర్ చేయబడిందని కేంద్రం వాదించింది, ఇది "సహజ న్యాయం సూత్రాలను అంగీకరించిన స్పష్టమైన ఉల్లంఘనకు దారితీసింది. వాస్తవానికి, న్యాయవిరుద్ధానికి దారితీసింది". అని కేంద్రం తెలిపింది.
నలుగురు దోషులకు మరణశిక్ష విధించడాన్ని రాజీవ్ గాంధీ భార్య, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమర్థించారు. వారి కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా నిందితులలో ఒకరిని కలుసుకున్నారు. ఆమెను క్షమించారు. అయితే పార్టీ నాయకత్వం గాంధీలతో విభేదించి తీవ్రంగా స్పందించింది.
'మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడిపించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. పూర్తిగా తప్పు' అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
మే 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో ఉండగా రాజీవ్ గాంధీని ఆత్మాహుతి దాడిలో ఎల్టీటీయూ సానుభూతిపరులు చంపారు. ఈ కేసులో సహకరించిన ఏడుగురికి జీవిత ఖైదు విధించబడింది.
ఖైదీల సత్ప్రవర్తనతో ఈ కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తి ఏజీ పెరరివాలన్ మే నెలలో విడుదల అయ్యారు. అరెస్టు చేసే సమయానికి అతడి వయసు 19 ఏళ్లు, 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం వంటి అంశాల ఆధారంగా తమ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. ఇటీవల మిగతా మారిని విడుదల చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.