ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తున్నారు.. జనసేనాని పవన్ కల్యాణ్. ఇటీవల కాలంలో ఆయన గతంలో కంటే మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం, ఇప్పటం ఘటనల తర్వాత ప్రజల్లో తన పట్ల సానుభూతి వ్యక్తమవుతోందని పవన్ నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో బాబాయ్ పవన్ కల్యాణ్‌కి అబ్బాయ్ రామ్‌చరణ్ ఫ్యాన్స్ మద్దతు పలకడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రామ్‌చరణ్ అభిమానులు తాజాగా సమావేశం నిర్వహించారు. రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి తమ మద్దతు ప్రకటించాలని ఐదు రాష్ట్రాల అభిమానులు తీర్మానం చేసినట్టు సమాచారం. అదేవిధంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది.
కాగా ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం పలు ఇంటర్వ్యూల్లో తన బాబాయ్ పవన్ కల్యాణ్ అడగాలే కానీ ఆయన ఏం చేయమంటే అది చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. చివరకు ఆయన ప్రచారం చేయమన్నా చేస్తానని రామ్‌చరణ్ వెల్లడించారు.
అదేవిధంగా ఇటీవల పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కొంతమంది దుండగులు రెక్కీ నిర్వహించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగానూ రామ్ చరణ్ ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ సెక్యూరిటీ కోసం కొంతమందిని పంపారని వార్తలు వచ్చాయి.
అదేవిధంగా జనసేనకు మీడియా బలం లేకపోవడంతో ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలతోపాటు కొన్ని వెబ్‌సైట్లు, ఒక మీడియా చానెల్ సైతం ఆయన ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు హల్చల్ చేశాయి. జన సైనికులు సైతం పలుమార్లు సోషల్ మీడియాలో రామ్ ^è రణ్‌కు విజ్ఞప్తి చేశారు. జనసేనకు మద్దతుగా టీవీ చానెల్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల రామ్ ^è రణ్ అభిమానులు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి అండగా నిలవాలని నిర్ణయించడం విశేషం. ఇప్పటికే విజయవాడలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, ఇతర మెగా హీరోల అభిమానులు భారీ సమావేశం నిర్వహించి తమ మద్దతును జనసేన పార్టీకి అందించారు.
పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మెగాభిమానులు నడుస్తారని.. ఆయన కార్యాచరణను నిర్దేశించాలని కోరారు. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు కూడా జనసేనకు అండగా నిలవడంతో ఆ పార్టీకి బూస్ట్ వచ్చినట్టేనని అంటున్నారు.