శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కుటుంబంగా కింజరాపు వారి ఫ్యామిలీని చెప్పుకోవాలి. ఆ కుటుంబానికి మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎర్రన్నాయుడు సుదీర్ఘకాలం చేసిన రాజకీయం మూలంగా ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ లో బలమైన క్యాడర్ మద్దతుదారులుగా ఉన్నారు. అందువల్లనే సునాయాసంగా కింజరాపు ఫ్యామిలీ శ్రీకాకుళం ఎంపీ సీటుని అనేక సార్లు గెలుచుకుంటూ వచ్చింది.
ఇదిలా ఉంటే తండ్రి ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వాన్ని రామ్మోహననాయుడు నిలబెట్టారు. ఒక విధంగా తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నారు. శ్రీకాకుళం ఎంపీగా ఇప్పటికి రెండు మార్లు గెలిచారు. పార్లమెంట్ లో బలంగా తన వాణిని వినిపించి సత్తా చాటారు. అయితే అబ్బాయి మనసు అసెంబ్లీ సీటు మీద పడింది అంటున్నారు. నిజానికి 2019 ఎన్నికల టైమ్ లో కూడా శాసనసభకు పోటీ చేయాలని రామ్మోహన్నాయుడు భావించినా చంద్రబాబు ఆయన మీద వత్తిడి చేసి ఎంపీగానే బరిలోకి దించారు అని ప్రచారంలో ఉంది.
ఈసారి మాత్రం అలా కాదు అబ్బాయి అసెంబ్లీకి పోటీ చేయాల్సిందే, మంత్రి కావాల్సిందే అని ఆయన అనుచరులు పట్టుబడుతున్నరుట. ఇక కింజరాపు ఫ్యామిలీకి మంచి పట్టున్న నియోజకవర్గాలలో నరసన్నపేట ఒకటి. ఇక్కడ వైసీపీ తరఫున పలు మార్లు గెలిచిన ధర్మాన క్రిష్ణదాస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గత మూడేళ్ళు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా తానే పోటీ అని దాసన్న చెబుతున్నా ఇక్కడ వైసీపీలో వర్గ పోరు, దాసన్న మీద వ్యతిరేకత పెరగడంతో వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
మరో వైపు నరసన్నపేటలో చూస్తే భగ్గు లక్ష్మణరావు, రమణమూర్తి రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఈసారి ఆ ఇద్దరూ తమకు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రామ్మోహన్ బరిలోకి దిగితే వారు కచ్చితంగా మద్దతుగా నిలుస్తారు. ఇపుడు చూస్తే ఇక్కడ టీడీపీకి అంతా అనుకూలమైన పరిస్థితి ఉంది. దాంతో రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తే గెలుపు అవకాశాలు రెట్టింపు అవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుంది అని నమ్మకంగా ఉన్నారు. పైగా యువతకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్న అధినాయకత్వం రామ్మోహన్ కి అసెంబ్లీ దారి చూపించవచ్చు అని అంటున్నారు. అదే జరిగితే పేటలో ఇంటరెస్టింగ్ పోరు సాగుతుంది.
అటు సీనియర్ నేత ధర్మాన క్రిష్ణ దాస్ కి ఇటు రామ్మోహన్ కి జరిగే పోరు రాజకీయాల్లో కీలకమైన ఘట్టం కానుంది. అయితే రామ్మోహన్ అసెంబ్లీకి పోటీ చేస్తే శ్రీకాకుళం ఎంపీ సీటుకు గట్టి క్యాండిడేట్ ఎవరా అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. అధినాయకుడు చంద్రబాబు దీని మీద ఏమాలోచిస్తారో కూడా చూడాలి.