ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సాత్వికుడిగా పేరున్న ఆయనకు.. న్యాయశాస్త్రాల మీద విపరీతమైన పట్టు ఉందని చెబుతుంటారు. పన్నెండేళ్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించిన ఆయన.. ఎంపీగా సభలో ఆయన సంధించిన ప్రశ్నలు కొన్ని ఆసక్తికరంగా ఉండటమేకాదు.. ఘాటుగా ఉన్నాయని చెప్పక తప్పదు.
పార్లమెంటులో జరిగిన కీలక చర్చల్లో పాల్గొన్న ఆయన.. కొన్ని అంశాలపై విస్పష్ట వైఖరిని వ్యక్తం చేయటమే కాదు.. కొత్త కోణాల్లో తన వాదనను వినిపించటం కనిపిస్తుంది. 2006 మార్చి 3న కోర్టు ధిక్కరణ (సవరణ) బిల్లు 2006పై జరిగిన చర్చపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో ఆయన మాట్లాడిన మాటలు పెద్దగా ఫోకస్ కాకున్నా.. తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి పదవిని చేపట్టే అవకాశం ఉన్నవేళ.. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
దేశానికి ప్రథమ పౌరుడైన రాష్ట్రపతినే విమర్శించే అవకాశం ఉందని.. అలాంటప్పుడు న్యాయమూర్తులను విమర్శించేందుకు..నిందించేందుకే వీలు లేకపోవటం ఏమిటి? అంటూ ఆయన సూటిగా అడిగిన ప్రశ్న ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. రాష్ట్రపతిని విమర్శించే వీలున్నప్పుడు.. న్యాయమూర్తులను మాత్రం విమర్శించకుండా మినహాయింపు ఇవ్వటం ఏమిటంటూ ప్రశ్నించారు.న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతేనన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
న్యాయవ్యవస్థ కొంత అవినీతిమయం అయ్యిందంటూ ఒక న్యాయమూర్తి ప్రశ్నించటాన్ని గుర్తు చేసిన రామ్ నాథ్.. అవినీతి.. అసమర్థత ఎక్కడున్నా వాటిని సాధారణ పౌరులు మాట్లాడేందుకు అవకాశం ఉండాలన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పటం కనిపిస్తుంది. వివిధ సందర్భాల్లో ఆయన సంధించిన పలు ప్రశ్నల్ని చూస్తే.. రామ్ నాథ్ ఇష్యూల మీద ఎంతగా రియాక్ట్ అయ్యారో తెలుస్తుంది. రామ్ నాథ్ లేవనెత్తిన కొన్ని ఆసక్తికర అంశాల్ని చూస్తే..
+ భారత్ - చైనా యుద్ధంపై జనరల్ హండర్సన్ నివేదిక బయటపెట్టాలి
+ ఎస్సీ.. ఎస్టీ రిజర్వేషన్లు.. వెనుకబడినవర్గాల అకృత్యాలపై.. పార్లమెంటులో పలుమార్లు గళం విప్పటం
+ అశ్లీల చిత్రాలు.. సెన్సార్ పూర్తి కాని కార్యక్రమాలు టీవీల్లో టెలికాస్ట్ కాకుండా నిషేధించే అవకాశాలపై ప్రశ్న
+ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కు గౌరవంగా వెయ్యి రూపాయిల నోట్ల మీద ముద్రించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నను సంధించటం
+ 1998లో నోట్ల రద్దును ప్రశ్నించి.. వెయ్యి రూపాయిల నోట్లను తిరిగి ప్రవేశ పెట్టే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/