‘రాంరెడ్డి చికిత్సకు ప్రభుత్వం ఖర్చు చేసింది’

Update: 2016-03-11 06:33 GMT
సమయానికి తగ్గట్లుగా మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. చేసిన పనిని చెప్పుకుంటే కానీ తెలియదని అనుకున్నారో.. తన కమిట్ మెంట్ ను ప్రదర్శించాలని భావించారో కానీ.. ఒక విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల మరణించిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మృతికి సంతాపం తీర్మానం సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. వెంకటరెడ్డి సేవల్ని కొనియాడిన .. క్యాన్సర్ తో మరణించటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికై.. ఒకసారి పూర్తికాలం మంత్రిగా వ్యవహరించిన ఆయనది స్నేహపూర్వక వ్యక్తిత్వంగా కొనియాడారు.

క్యాన్సర్ తో బాధపడిన వెంకటరెడ్డి చికిత్స కోసం ఆసుపత్రి ఖర్చుల్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందని చెప్పిన కేసీఆర్.. అలాంటి నేతలకు క్యాన్సర్ రావటం దురదృష్టకరమన్నారు. పార్టీలకు అతీతంగా.. నేతలు ఎవరికి కష్టం వచ్చినా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న విషయాన్ని కేసీఆర్ తన సంతాప సందేశంలో చెప్పకనే చెప్పినట్లు లేదు..?
Tags:    

Similar News