జేడీ లక్ష్మీనారాయణ... ఆయన ఇప్పుడు మన వద్ద ఆ పదవిలో లేరు. ఆయన ఇంటి పేరు వేరు.. కానీ, జేడీ అన్నది ఆయనకు ఇంటిపేరుగా మారిపోయింది. జేడీ లక్ష్మీనారాయణ అంటే ఒక హీరో... యూత్ కు ఇన్ స్పిరేషన్.. అవార్డు ఫంక్షన్లకు ఆయనే గెస్టు.. కాలేజీల్లో మోటివేషన్ లెక్చర్లు. అబ్బో... ఒకటేమిటి, జేడీ లక్ష్మీనారాయణకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన పాపులారిటీ అంతాఇంతా కాదు. కానీ... ఆయనకు అంత సీను లేదంటున్నారు మాజీ సీఎస్ - విశ్రాంత ఐఏఎస్ రమాకాంత్ రెడ్డి. అసలు రాష్ట్రాల్లో పాలన వ్యవస్థ ఎలా ఉంటుంది.. రాష్ట్రాల్లో రూల్సేమిటి అన్నవి లక్ష్మీనారాయణకు తెలియవని.. ఆయనకు కేంద్ర ప్రభుత్వ రూల్సు మాత్రమే తెలుసని చెబుతూ... తాను లక్ష్మీనారాయణకు అడిగిన మూడు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారని.. దాంతో మీ విచారణఫై నాకు నమ్మకం లేదని తెగేసి చెప్పేశానని రమాకాంత్ రెడ్డి తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ గురించి మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి చెప్పిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. జగన్ ఆస్తుల కేసు సమయంలో రమాకాంత్ రెడ్డిని కూడా సీబీఐ విచారణకు పిలిచి ప్రశ్నించింది. ఆ సమయంలో లక్ష్మీనారాయణకు తనకు మధ్య జరిగిన సంభాషణను రమాకాంత్ రెడ్డి వివరించారు.
* కేసు విచారణ సమయంలో కొందరి పేర్లు చెప్పి వారిని ఎందుకు పిలిచి ప్రశ్నించడం లేదని తాను అడిగానన్నారు. అందుకు జేడీ లక్ష్మీనారాయణ నిస్సహాయంగా ఒక నవ్వు నవ్వి... వారిని పిలిస్తే వ్యవహారం పెద్దదైపోతుందని సమాధానం ఇచ్చారట.
* విదేశాల్లో డొల్ల కంపెనీలు ఉన్నాయంటున్నారు కదా.. మరి విదేశాలకు విచారణ కోసం ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా… అందుకు కూడా జేడీ లక్ష్మీనారాయణ సమాధానం చెప్పలేకపోయారట. విదేశాలకు లేఖలు రాశామని.. వారు సమాచారం ఇస్తే సరేసరి.. లేదంటే ఏమీ చేయలేమన్నారట.
*దాంతో రమాకాంత్ రెడ్డి... విచారించాల్సిన వారిని విచారించకుండా, విదేశాలకు వెళ్లకుండా దర్యాప్తు చేయకుండా దాటవేస్తే ఈ కేసు నిలబడుతుందని మీరు నమ్ముతున్నారా? అంటే.. జేడీ నుంచి కేవలం ఒక నవ్వు మాత్రమే సమాధానంగా వచ్చిందట.
దీంతో.. రమాకాంత్ రెడ్డి మీ విచారణ వల్ల ఫలితం ఉంటుందని నాకు నమ్మకం లేదండీ అని చెప్పేశారట. ఆ తరువాత జేడీ.. ‘‘మా ఆఫీసులో నా గదిలో మాత్రమే ఏసీ ఉంది సార్.. మీరు అక్కడ రెస్టు తీసుకోండి. నేను వేరే గదిలో పనిచేసుకుంటాను’’ అని చెప్పారట. జేడీ లక్ష్మీనారాయణ పరిస్థితి ఏంటనేది వివరిస్తూ రమాకాంత్ రెడ్డి ఈ విషయాలు చెప్పారు.
అంతేకాదు.. సీబీఐ అధికారులకు ప్రభుత్వ రూల్స్ గురించి కనీస అవగాహన కూడా లేదన్న విషయం తెలిసి.. జీఏడీ నుంచి ఒక లేడీ ఆఫీసర్ ను పిలిచి ఆమెతో సీబీఐ అధికారులకు రూల్సు గురించి మొత్తం వివరంగా చెప్పించారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉంటాయన్నది సీబీఐ అధికారులకు వివరించడానికి ఒక రోజంతా పట్టిందట.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/