కరోనా మళ్లీ శీతాకాలంలో మొదలౌతుంది..సిద్ధంగా ఉండాలంటున్న డాక్టర్!

Update: 2020-05-06 01:30 GMT
దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకునే చర్యల్లో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి కోసం ప్రణాళికలు, కంటైన్మెంట్, కోవిడ్ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈయన తన వంతు పాత్ర పోషించారు.

కరోనా ఇప్పట్లో మనల్ని వదిలివెళ్దదు అని , కొన్ని రోజులపాటు కరోనా తో కలిసి జీవించాలని అయన తెలిపారు. వచ్చే శీతాకాలంలో భారతదేశంలో కరోనావైరస్ రెండోసారి విజృంభించే అవకాశం ఉందని అన్నారు. దాదాపు ఏడాదిపాటు కరోనా మహమ్మారితో మనం పోరాటం చేయాల్సి ఉందని చెప్పారు. అలాగే , దేశంలోని హాట్‌ స్పాట్లలో కరోనా కేసులను తగ్గించడంపై డాక్టర్ గులేరియా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒకే ఆలోచనను అన్ని ప్రాంతాల్లో అమలు చేయడం కుదరదని అన్నారు. హాట్ స్పాట్లను దగ్గర్నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. బహిరంగ ప్రాంతాల్లో గుంపులుగా తిరగడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని అన్నారు కరోనా పోరాటంలో ప్రైవేటు రంగం కూడ తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మొత్తంగా అయన దేశంలో ప్రస్తుతానికి కొన్ని రోజుల తరువాత ఈ లాక్ ‌డౌన్ ఎత్తివేసిన తర్వాత శీతాకాలంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. బెడ్స్, పారామెడికల్ సిబ్బంది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, వెంటిలేటర్స్ లాంటి వసతులు సిద్ధం చేయాలన్నారు. ఇకపోతే , ఇప్పటివరకు భారతదేశంలో ఇప్పటికే 46,605 కేసులు నమోదు కాగా, 12,948 మంది కోలుకున్నారు. 1,573 మంది మరణించారు. 32,080 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Tags:    

Similar News