వివాదాలతో సహవాసం చేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం ‘వంగవీటి’. పేరుకున్న క్రేజ్ తో పాటు.. తీసుకున్న సబ్జెక్ట్ ఎంత వివాదాస్పదమైందో తెలిసిందే. దీనికి తోడు.. ఈ చిత్రాన్ని వర్మ తీసిన విధానం ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ పుణ్యమా అని.. కలెక్షన్లకు ఢోకా లేకుండా ఉంది. కాసుల జోరు బాగానే ఉన్నా.. వివాదాల హోరు కూడా అదే స్థాయిలో ఉంది.
తమను హర్ట్ చేసేలా సీన్లు ఉన్నాయంటూ వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధా.. ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేయటం.. ఆయన సూచనతో ఒక డైలాగ్ ను తొలగించేందుకు వర్మ ఓకే అనటం తెలిసిందే. తాజాగా వంగవీటి యువసేన.. వంగవీటి చిత్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వర్మ తమను మోసం చేశాడని అగ్గి మీద గుగ్గిలంలా వారు మండిపడుతున్నారు. ఈ సినిమాలో రంగాను హీరోగా చూపిస్తామని చెప్పారని..తాము పాల్గొన్న షూటింగ్ లోనూ రంగను హీరోగానే చూపించారని.. కానీ.. రిలీజ్ అయిన సినిమాలో మాత్రం ఆ సీన్లు లేవని వారు చెబుతున్నారు. రంగా చేసిన సేవల్ని సినిమాలో ఎక్కడా చూపించలేదని.. తాజా సినిమాతో తమ మనోభావాలుతీవ్రంగా దెబ్బ తిన్నట్లుగా వారు చెబుతుననారు.
అందుకే.. రంగా చేసిన సమాజ సేవను మళ్లీ షూట్ చేసి సినిమాకు జత చేయాలని.. అందుకు టూ డేస్ మాత్రమే తాము టైం ఇవ్వనున్నట్లు వారు చెబుతున్నారు. ఒకవేళ తాము చెప్పినట్లు కానీ చేయకుంటే మాత్రం తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని వారు వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. ఈ హెచ్చరికలకు వర్మ ఎలా రియాక్ట్ అవుతారో..?