కేసీఆర్ ఇంటికి జ‌గ‌న్.. రేర్ ఫ్రేమ్ ఒక‌టి ఫిక్స్!

Update: 2019-05-26 05:30 GMT
టీఆర్ ఎస్ అధినేత‌గా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించే స‌మ‌యంలో ఆయ‌న నివాసానికి వ‌చ్చే ప్ర‌ముఖులు.. నాటి ప‌రిస్థితి వేరుగా ఉండేది. ఉద్య‌మ‌కారులు.. ఉద్య‌మ‌నేత‌ల‌తో పాటు.. ప‌లువురు రాజ‌కీయ‌నేత‌లు ఇలా అంద‌రూ.. ఆయ‌న్ను టీఆర్ఎస్ ఆఫీసులోనే క‌లిసేవారు. అతికొద్ది మాత్ర‌మే ఆయ‌న ఇంటికి వెళ్లేవారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. సీఎంగా ఐదేళ్లు పూర్తి అవుతున్న కేసీఆర్ ఇంటికి పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు వ‌చ్చి ఉంటారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ లోకి అడుగు పెట్టిన త‌ర్వాత అతిధుల తాకిడి కాస్త ఎక్కువైంద‌న్న పేరుంది.ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసీఆర్ నివాసానికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా రేర్ పొలిటికల్ ఫ్రేమ్ ఒక‌టి ద‌ర్శ‌న‌మిచ్చింది. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో కొన్ని కాంబినేష‌న్లు తాజా ఫ్రేమ్ లో ఉండ‌టం విశేషంగా చెప్పాలి. కేసీఆర్ నివాసానికి ఎంతోమంది ప్ర‌ముఖులు వ‌చ్చినా.. కేసీఆర్‌.. ఆయ‌న కుమారుడు కేటీఆర్ త‌ప్ప‌క క‌నిపిస్తుంటారు. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో మాత్ర‌మే కేసీఆర్ స‌తీమ‌ణి క‌నిపిస్తారు. ఇక‌.. కేటీఆర్ స‌తీమ‌ణి పెద్ద‌గా క‌నిపించ‌రు. అలాంటిది తాజాగా జ‌గ‌న్ వ‌స్తున్న వేళ‌.. కేసీఆర్ ఆయ‌న స‌తీమ‌ణి.. కేటీఆర్ ఆయ‌న స‌తీమ‌ణి ఉన్నారు.

ఇదో ఆస‌క్తిక‌ర‌మైన అంశమైతే.. మ‌రో ఇంట్ర‌స్టింగ్ విష‌యం ఏమంటే.. రాజ‌కీయ భేటీల‌కు తాను ఒక్క‌డే వెళ్ల‌టం అల‌వాటైన జ‌గ‌న్‌.. తాజాగా కేసీఆర్ నివాసానికి వెళ్లే సంద‌ర్భంలో ఆయ‌న త‌న స‌తీమ‌ణి భార‌తిని కూడా వెంట పెట్టుకెళ్ల‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ కాంబినేష‌న్లో ఇంత‌కు ముందెప్పుడు క‌నిపించ‌లేద‌నే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే.. కేసీఆర్ ఇంటికి జ‌గ‌న్ రావ‌టం ఒక ఇంటి కార్య‌క్ర‌మంగా మారిందే త‌ప్పించి.. ప‌క్క రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి వ‌చ్చిన‌ట్లుగా ఫార్మ‌ల్ గా క‌నిపించ‌లేదు. ఇంటికిముఖ్య‌మైన బంధువు వ‌చ్చిన‌ప్పుడు ఇంట్లో ఉండే సంద‌డికి త‌గ్గ‌ట్లే కేసీఆర్ ఇంటికి జ‌గ‌న్ రాక‌గా చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ఈ ముగ్గురు ప్ర‌ముఖులు.. వారి స‌తీమ‌ణుల‌తో క‌లిసి ఒకే ఫ్రేమ్ లోకి రావ‌టం ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ఈ కాంబినేష‌న్ పిక్.. రేర్ అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News