ఎలుకలకు దాగుడు మూతలు ఇష్టమట

Update: 2019-09-16 05:30 GMT
ఎలుకలపై ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలను శాస్త్రవేత్తలు నిర్వహించారు. మనిషికి ఎలుకకు కాస్త దగ్గర ప్రవర్తన పోలికలు ఉంటాయని.. అలాగే ఏదైనా ఔషదం తయారు చేసిన సమయంలో మొదట ఎలుకలపై ప్రయోగించడం మనం చూస్తూ వస్తున్నాం. తాజాగా జర్మన్‌ శాస్త్రవేత్తలు ఎలుకల గురించి మరో ఆసక్తికర విషయాన్ని ప్రయోగం చేసి మరి నిరూపించారు. ఇంట్లో ఎలుకలు ఉంటే మనుషుల అలికిడి అవ్వగానే సందులోంచి తొంగి చూడటం.. మళ్లీ మళ్లీ మనుషులను చూస్తున్నట్లుగా అవి ప్రవర్తించడం చేస్తూ ఉంటాయి. ఆ విషయమై అధ్యయనం చేసిన జర్మన్‌ శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన విషయాన్ని కనుగొన్నారు.

ఎలుకలకు దాగుడు మూతలు అంటే చాలా ఇష్టమని.. అవి తమ ప్రవర్తనతో మనుషులకు తెలియకుండానే ఆటలో భాగస్వామి అయ్యేలా చేస్తాయి అన్నారు. మనుషులు వాటి గురించి వెతుకుతున్నారని అనిపించినప్పుడు కనిపించడం తప్పించుకోవడం చేస్తూ ఉంటాయట. మనుషుల సహనంను పరీక్షించేలా ఆ ఎలుకలు చేస్తాయని అన్నారు. మనుషులను చూసినప్పుడు ఎలుకలకు ఆనందం కలగడంతో పాటు చిలిపి పనులు చేయాలనిపిస్తుందట. 30 మీటర్ల విస్తీర్ణం ఉన్న ఒక గదిలో కొన్ని ఎలుకలను ఉంచి జర్మన్‌ శాస్త్రవేత్తలు వాటి ప్రవర్తనను విశ్లేషించారు. ఆ సమయంలోనే మనుషులను చూస్తున్న సమయంలో వాటి ప్రవర్తన ఇంకా అవి చేసే అల్లరి ఇంకా దాగుడు మూతల ఆట చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారట.
Tags:    

Similar News