పార్టీ ప‌రువు గంగ‌పాల‌యినా జోక్యం చేసుకోవా బాబు?

Update: 2018-05-12 14:02 GMT
త‌మ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌ని చెప్పుకోవ‌డమే కాకుండా పార్టీ అధినేత అంటే పెద్ద ఎత్తున గౌర‌వ‌భావం ఉంటుంద‌ని... ఈ విష‌యంలో మిగ‌తా పార్టీల‌కు తాము ఆద‌ర్శ‌మ‌ని టీడీపీ నేతలు చెప్పుకొనే సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ప్ర‌చారానికి పూర్తి విరుద్ధంగా ఎన్నో ఘ‌ట‌న‌లో చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నేతలపైనే ఆ పార్టీ సీనియర్ నేత - మాజీ మంత్రి రావెల కిషోర్‌ బాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం ఏంటని ప్రశ్నించారు. దళిత ప్రజా ప్రతినిధుల నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఇలాంటి చర్యలతో దళిత జాతిలో అభద్రతాభావం పెరుగుతుందన్నారు.

ఈ వివ‌రాల్లోకి వెళితే...ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు వివాస్పదంగా మారాయి. తనిఖీలలో భాగంగా ఒక విద్యార్ధి వద్దకు వెళ్లి చుట్టుపక్కల ఏమి జరుగుతుందో చుసుకోవా అంటూ బిగ్గరగా గద్దించాడు. సీరియస్ గా పాటలు వింటున్న విద్యార్ధిని  నీది ఏ కులం అని ప్రశ్నించారు. విద్యర్ది ఎస్సి అని చెప్పగా, ఎస్సీ అంటే మాల లేక మాదిగా అని అడిగారు. మాదిగ అని చెబితే - నువ్వేమి చదువుతావు, పక్కనే పట్టించుకోవటంలేదు, వెదవా కనీసం పరిక్షలు కూడా రాసి ఉండవు. ఇంత చిన్న వయస్సులో సెల్ ఫోన్ ఎందుకు రా..? మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొలం ఉందా? బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది? డబ్బుల్లేకపోతే ఎలా చదువుకుంటావ్.. ఫోన్లవి పక్కనపెట్టి చదువుకో’ అంటూ విద్యార్ధికి హితవు పలికాడు.

దీనిపై మాజీ మంత్రి రావెల ఫైర‌య్యారు. మాదిగ విద్యార్థిపై వర్ల వ్యాఖ్యలను తీవ్ర ఖండిస్తున్నామన్నారు. వర్ల దుహంకారాన్ని తగ్గించుకోవాలని హెచ్చరించారు. వర్ల పట్ల మాదిగ జాతి ఆగ్రహంతో రగిలిపోతోందన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు. వర్ల తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలంతా ఉద్యమానికి సిద్ధం కాకముందే వర్ల తన తప్పును దిద్దుకోవాలని సూచించారు. జిల్లా అధికారుల ఏకపక్ష తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి దళితులను అక్కున చేర్చుకుంటే నేడు దళితులపై జరుగుతున్న సంఘటనలు సరైనవి కావని రావెల హితవు పలికారు.ఇదిలాఉండ‌గా..పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు ఇలా రోడ్డెక్కిన‌ప్ప‌టికీ...ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పందించ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

Tags:    

Similar News