బాబు సేఫ్ లాక్ లో రావెల ఫ్యూచర్?

Update: 2017-02-03 06:48 GMT
వివాదాస్పద వ్యాఖ్యల కంటే చేష్టలతో తరచూ బుక్ అయ్యే ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబుకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటిప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఆ మధ్యన మంత్రివర్యుల వారు తన వ్యక్తిగత సిబ్బంది.. సెక్యూరిటీకి చెప్పకుండా మూడు గంటలకు పైనే వెళ్లిపోవటం.. ఆయన ఎక్కడికి వెళ్లారో అర్థం కాక తల పట్టుకోవటమే కాదు.. విపరీతంగా కంగారు పడిపోయారు కూడా.

చివరకు ఆయన తన స్నేహితుడు రాంబాబు ఇంటికి భోజనానికి వెళ్లిన విషయాన్ని గుర్తించి.. ఆయన సేఫ్ గా ఉన్నారన్నది కన్ఫర్మ్ చేసుకొని హమ్మయ్యా అని అనుకున్న పరిస్థితి. ఈ విషయం అప్పటికప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.ఆయన ఎక్కడ ఉన్నదన్న విషయాన్ని వివరించిన తర్వాత..స్నేహితుడికి ఇంటికి చెప్పాపెట్టకుండా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆరా తీయాలంటూ ఇంటెలిజెన్స్ వర్గాల్ని సీఎం ఆదేశించినట్లుగా చెబుతున్నారు.

మొత్తంగా ఈ ఎపిసోడ్ మీద అన్ని కోణాల్లో దృష్టి సారించిన నిఘా వర్గాలు ఎట్టకేలకు ఒక నివేదికను సిద్ధం చేశారట. ఆ రోజు అసలేం జరిగింది. రావెల ఎందుకంత రహస్యంగా వెళ్లింది? లాంటి ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు తెలిసేలా వివరాలు నివేదికలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రిపోర్ట్ ను తీసుకున్న చంద్రబాబు.. వాటిని చదువుకొని.. తన ఛాంబర్ లోని సేఫ్ లాక్ లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీల్డ్ కవర్ రిపోర్ట్ రావెల ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుందన్న వాదన జోరుగా వినిపిస్తోంది. ఇంతకీ రావెల తప్పు చేశారా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News