తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి ముఖ్యనేత గుడ్ బై చెప్పారు. పత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రావెల కిశోర్ బాబు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. రేపు నాగార్జున యూనివర్సిటీ నుంచి ర్యాలీగా వెళ్లి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారని సమాచారం. అయితే, రావెల గుడ్ బై చెప్పే ఎపిసోడ్ లో టీడీపీ పెద్దల ప్రయత్నం విఫలమయినట్లు సమాచారం.
రైల్వే శాఖలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న రావెల కిశోర్ బాబు... ఉద్యోగానికి రాజీనామా చేసి 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రత్తిపాడు నుంచి గెలిచారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ లో ఆయనకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. అయితే తర్వాత రానురాను నియోజకవర్గంలో రావెల సొంత పార్టీ నేతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చి అనంతరం పదవి కోల్పోయారు. అనంతరం మాదిగ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగ కురుక్షేత్ర సభకు రావెల కిశోర్ బాబు పరోక్షంగా అన్నిరకాలుగా సాయం అందించారని చంద్రబాబు ఆగ్రహం అప్పట్లో వ్యక్తం చేశారు. అప్పటి నుంచి రావెల కిశోర్ బాబును పార్టీ అధిష్టానంతో పాటు జిల్లాకు చెందిన నేతలు కూడా పక్కన పెట్టేశారు. దీంతో రావెల పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఒక దశలో వైసీపీలోకి రావెల ఎంట్రీ త్వరలోనే అన్న వార్తలూ వచ్చాయి.
అయితే, రావెల టీడీపీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో హైకమాండ్ అలెర్ట్ అయ్యంది. ఆయనను బుజ్జగించడానికి పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. అయితే, టీడీపీ బుజ్జగింపులకు ఆయన మెత్తబడలేదు. జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన జనసేనలో చేరున్నారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీకి ఈ పరిణామం షాక్ వంటిదంటున్నారు.