ఏపీ మంత్రుల్లో పొలిటికల్ గా బాగా జూనియర్ అయిన రావెల కిశోర్ బాబు చంద్రబాబును మెప్పించడంలో బాగా సీనియర్.. అయితే, అదంతా గతం. ఆయన చంద్రబాబు మెప్పు కోసం అవసరం ఉన్నా లేకున్నా రోజూ జగన్ ను తిడుతున్నా కూడా ఆయనంటే చంద్రబాబుకు కానీ, లోకేశ్ కు కానీ నమ్మకం ఏర్పడడం లేదట. పైగా రావెల చుట్టూ అనేక వివాదాలు ఉండడంతో ఆయన ఏం చేసినా అనుమానంగా చూస్తున్నారట. రావెలకు చెందిన ఫైళ్లన్నీ ఇపుడు లోకేష్ కు వెళ్లిన తర్వాతనే క్లియర్ అవుతున్నాయని సమాచారం. ప్రస్తుతం రావెల పేరుకే మంత్రి కానీ ఆ శాఖ మొత్తం లోకేశ్ అండర్ లోకి వెళ్లిపోయిందట.
ఇటీవల రావెల కిషోర్ బాబు రాత్రిపూట గుంటూరులో తన గన్ మెన్ లను సైతం పక్కన బెట్టి కన్పించకుండా వెళ్లారన్నది సమాచారం. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ వెళ్లింది. దీంతో ఆయన స్వయంగా విచారణ చేయించుకున్నట్లు సమాచారం. వాస్తవానికి మంత్రిహోదాలోఉన్న వ్యక్తి తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కాదని ఎటూ ఒంటరిగా వెళ్ళకూడదు. విషయం తెలిసినా రావెల మాత్రం అలా చేశారు. రెండు గంటల పాటు మంత్రి ఎక్కడకు వెళ్లిందీ..ఏమైపోయిందీ ఎవరికీ తెలయలేదు. దీంతో అంతటా టెన్షన్ నెలకొంది. ఇంటిలిజెన్స్ వ్యవస్థకూడా దీనిపై విచారించి ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. రావెల ఏవో రహస్య వ్యవహారాలు నడుపుతున్నారని చంద్రబాబు అనుమానిస్తున్నారట.
ఇంతకుముందు గుంటూరు జడ్పీ ఛైర్మన్ విషయంలో మంత్రి రావెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి స్యయంగా కల్పించుకొని, కమిటీ వేసి మరీ ఈసమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. ముస్లిం మహిళ విషయంలో మంత్రి కఠినంగా వ్యవహరించడంతో రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది. ఎస్సీ, ముస్లింల సమస్యగా అది రాజుకొనడంతో ముఖ్యమంత్రి అప్రమత్తం అయ్యారు. మంత్రి రావెలపై సిఎం సీరియస్ అయ్యారు కూడా.
ఇలా నిత్యం రావెల చుట్టూ వివాదాలు ముసురుకుంటుండడంతో ఆయనపై నిఘా పెట్టారట. లోకేష్ కు ఆ బాధ్యతలు అప్పగించారట. రావెల వద్దకు వెళ్లే ప్రతి ఫైలు లోకేశ్ వద్దకు వెళ్లాల్సిందేనట. దీంతో మంత్రి రావెల తీవ్ర అసహనం,అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/