‘రేసుగుర్రం’సినిమా విలన్, బీజేపీ ఎంపీ అయిన రవికిషన్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట..రవికిషన్ ఎంపీ కాకముందు తెలుగులో రేసుగుర్రం, సైరా సహా పలు ప్రముఖ చిత్రాల్లో విలన్ గా నటించారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచారు. తాజాగా బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం గురించి పార్లమెంట్ లో లేవనెత్తిన రోజు నుంచి తనకు బెదిరింపుకాల్స్ వస్తున్నాయని ఎంపీ రవికిషన్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘దేశంలోని యువత జీవితాలు నాశనం కాకూడదని డ్రగ్స్ గురించి పార్లమెంట్ లో లేవనెత్తాను. అప్పటి నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయినా సరే నేను భయపడను. నా జీవితం గురించి లెక్క చేయను. దేశం కోసం బులెట్ల దాడిని కూడా ఎదుర్కొంటాను’ అని రవికిషన్ చెప్పారు.
కాగా సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో ముంబైలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసును బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ పార్లమెంట్ లో మొన్నటి సమావేశాల్లో లేవనెత్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి, ఎన్‌సీబీ మంచి పనిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం ఉన్న మిగిలిన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు.
పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని రవికిషన్ పార్లమెంట్ లో గళమెత్తారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు.ఈ ఆరోపణలు చేసినప్పటి నుంచి రవికిషన్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు ఆయన తెలిపారు.