తప్పులు చేయొచ్చు కానీ.. ఖరీదైన తప్పులకు తెలివైనోళ్లు చేస్తారా? అంటే.. చేయరనే చెప్పాలి. కానీ.. మీడియాలో ప్రముఖుడిగా మొన్నటివరకూ వెలిగిపోయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ తెలివితక్కువ తప్పులు చేస్తున్నారా? అన్న సందేహం కలిగే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 90 శాతం వాటాను చట్టబద్ధంగా దక్కించుకున్న వారికి షాకిచ్చే తెగింపునకు రవిప్రకాశ్ తెర తీయటాన్ని పలువురు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.
ఏ రకంగా చూసినా తన చర్యను ఎవరూ హర్షించరన్న చిన్న పాయింట్ ను అంత పెద్ద రవిప్రకాశ్ ఎలా మిస్ అయ్యారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.
గోరుతో పోయే దాన్ని గొడ్డలి వరకూ రవిప్రకాశ్ ఎందుకు తెచ్చుకుంటున్నారన్న మాట పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. వాతావరణం తనకు అనుకూలంగా లేకపోవటం.. తప్పులు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. కాస్త వెనకడుగు వేస్తే పోయేదేముంది? కానీ.. రవిప్రకాశ్ ఆలోచనలు ఆ తీరులో ఉన్నట్లుగా కనిపించట్లేదని చెప్పాలి.
పోలీసులు ఆయనకు ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవటంతో లుక్ అవుట్ నోటీసుల్ని పోలీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ఫారిన్ కు వెళ్లిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో నిజం పాళ్లు ఎంతన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీవీ9 పాత..కొత్త యాజమన్యం మధ్య వివాదం నెలకొన్న వైనం పోలీసుల దృష్టికి వెళ్లినంతనే రవిప్రకాశ్ పాస్ పోర్టు ను పోలీసులు స్వాధీనం చేసుకోవటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్లే సాహసం చేయరనే మాట వినిపిస్తోంది. ఒకవేళ.. అలాంటి పని చేస్తే.. టీవీ9 ఎపిసోడ్ లో చేసిన దాని కంటే తీవ్రమైన నేరారోపణను.. శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. మీడియా ప్రముఖుడిగా.. పాస్ పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత.. వేరే పాస్ పోర్ట్ లో విదేశాలకు వెళ్లటం పెద్ద నేరమన్న విషయం ఆయనకు తెలిసే ఉంటుంది. అలాంటివేళ.. ఆయన ఆ తప్పు చేసే అవకాశం లేదంటున్నారు. ఒకవేళ.. అలాంటి పని ఏమైనా చేసి ఉంటే మాత్రం.. అది ఖరీదైన మిస్టేక్ కావటం ఖాయమని చెప్పక తప్పదు.