జంప్ జిలానీకి వైసీపీ నేత‌ చెప్పు దెబ్బ‌లు

Update: 2016-12-31 15:36 GMT
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జ‌రుగుతున్న జంప్ జిలానీల‌కు అనూహ్య ప‌రిణామం ఇది. గుడివాడలో పార్టీ మారిన మున్సిపల్ ఛైర్మన్ ను రాజీనామా చేసి గెలవాలని వైసీపీ కౌన్సిలర్ చెప్పుతో కొట్టారు. వైఎస్సార్సీపీ టిక్కెట్టుపై గెలిచి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రవికాంత్ చెప్పుతో కొట్టారు. గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ స‌మావేశం సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

కౌన్సిల్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు కార్యాల‌యానికి వ‌చ్చిన చైర్మ‌న్ తీరును ర‌వికాంత్ త‌ప్పుప‌ట్టారు. వైసీపీ త‌ర‌ఫున గెలిచి పార్టీ మార‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ద‌మ్ముంటే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేస్తూ చెప్పుతో కొట్టారు. ఈ ఘటనతో కౌన్సిల్ హాల్ లో గందరగోళం ఏర్పడింది. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున జ‌రుగుతున్న జంప్ జిలానీలకు ఈ ప‌రిణామం షాక్ వంటిద‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News