రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏడాది డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించడం అనేక మలుపులు తిరుగుతోంది. పోలీస్ శాఖతో సహా ప్రభుత్వ ఉద్యోగులందరికీ డోప్ టెస్ట్ నిర్వహించాలని - నిందితులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై వచ్చిన విమర్శలకు పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ చెక్ పెట్టారు. అంతేకాకుండా సంచలన ప్రకటన చేస్తూ డోప్ పరీక్షలకు తాను సిద్దమేనని ప్రకటించారు.
డ్రగ్స్ అమ్మేవాళ్లకు - స్మగ్లర్లకు మరణశిక్షను ఖరారు చేయాలని సీఎం అమరిందర్ సింగ్ ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపారు. మాదక ద్రవ్యాలను అమ్మేవారు కానీ స్మగ్లింగ్ చేసేవారికి కానీ మరణశిక్ష విధించాలని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. తరతరాలుగా డ్రగ్ పెడ్లింగ్ అందర్నీ నాశనం చేస్తోందని - డ్రగ్స్ ను అమ్మేవారికి కఠినమైన శిక్షను విధించాలన్నారు. పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా డ్రగ్ టెస్ట్ చేసుకోవాలన్నారు. దీంతో ఉద్యోగులు - ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రజాప్రతినిధులు కూడా ఆ జాబితాలో ఉండాలని కొందరు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ను సీఎం అమరిందర్ స్వాగతించారు. తానూ డోప్ పరీక్షకు సిద్దమే అన్నారు. కానీ క్యాబినెట్ మంత్రులకు మాత్రం తాను హామీ ఇవ్వలేనన్నారు.
మరోవైపు ఈ ఎపిసోడ్ ను ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అనూహ్యమలుపు తిప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి డ్రగ్స్ అలవాటు ఉందని - డోపింగ్ టెస్ట్ నిర్వహిస్తే ఆ విషయం తేలుతుందని స్వామి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతూ స్వామి అసంబద్ద కామెంట్లు చేయడంలో ముందుంటారని వ్యాఖ్యానించారు.