ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వార్త సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ‘యన్.టి.ఆర్’ చిత్ర ప్రారంభోత్సవమే. హైదరాబాద్ లోని రామకృష్ణా స్టూడియోస్ లో ఉదయం అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించారు. సినీ పరిశ్రమ నుంచే కాక రాజకీయ రంగం నుంచి కూడా అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐతే ఈ చిత్ర కథానాయకుడు బాలయ్యకు వియ్యంకుడు.. ఎన్టీఆర్ అల్లుడు అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ఈ వేడుకకు రాలేదు. బాబు సతీమణి భువనేశ్వరితో పాటు ఎన్టీఆర్ కుటుంబం నుంచి చాలా మందే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మామూలుగా చంద్రబాబు ఇలాంటి వేడుకలకు రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటాడు బాలయ్య సినిమాల వేడుకలు చాలా వాటికి ఆయన హాజరయ్యారు. కానీ నందమూరి.. నారా కుటుంబాలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్ర ప్రారంభోత్సవానికి మాత్రం రాలేదు. బాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. వీళ్లు ఆంధ్రాలో కొన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కావాలంటే వాటిని అవాయిడ్ చేసే అవకాశముంది. ఆ కార్యక్రమాల్నే వాయిదా వేయించొచ్చు కూడా. అయినా ఈ వేడుకకు రాకపోవడానికి కారణం ఏంటి అంటే.. వెంకయ్య నాయుడు. ఈ కార్యక్రమానికి వస్తే ఆయన్ని కలవాలి. వేదికను పంచుకోవాలి. ముచ్చట్లు చెప్పాలి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి వచ్చి ఎన్డీఏకు టాటా చెప్పేశాడు చంద్రబాబు. ఐతే వెంకయ్యతో మాత్రం ఆయన సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయాలున్నాయి. కానీ ఆ విషయం బయటపడితే కష్టం. ఈ వేడుకకు వచ్చి వెంకయ్యతో ముభావంగా వ్యవహరించినా ఇబ్బందే. అందుకే ఇక్కడికి వచ్చి వెంకయ్యతో ముచ్చటించి జనాల దృష్టిలో వ్యతిరేకత ఎదుర్కోవడం ఎందుకని బాబు-లోకేష్ దీనికి దూరంగా ఉన్నట్లు సమాచారం.