అమ్మ అంత్యక్రియల డేట్ మారిన కారణం ఇదే..

Update: 2016-12-06 07:16 GMT
రాజకీయ నాయకులకు నమ్మకాలకు అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. ఇక.. వాస్తు.. జ్యోతిషం.. సంఖ్యాశాస్త్రం మీద అపారమైన గురి ఉండే వారైతే.. తామేం చేసినా ప్రతిది పండితుల సలహాలు తీసుకునే చేస్తారు. ఇక.. అమ్మగా అందరికి సుపరిచితురాలైన జయలలిత విషయానికి వస్తే.. ఆమెకు సంఖ్యా శాస్త్రం మీద గురి చాలా ఎక్కువ. ముహుర్తాలకు ఆమె ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే.. ఒకసారి ఆమె పెట్టుకున్న ముహుర్తం మంచిది కాదన్న విషయం ఆఖరి నిమిషంలో తెలిసి.. ప్రమాణస్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకోవటానికి సైతం వెనుకాడలేదు.

బ్రాహ్మణ వర్గానికి చెందిన జయలలితకు విశ్వాసాలకు సంబంధించిన పట్టింపులు చాలా ఎక్కువ. సంఖ్యశాస్త్రం మీదున్న నమ్మకంతో ఆమె పేరు 11 అక్షరాలు ఉంటే.. అదనంగా మరో ‘‘ఎ’’ను చేర్చుకున్నారు. అలాంటి ఆమె అంతిమ సంస్కారాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవటంతోనే ముందుగా అనుకున్న దాని కంటే ఒక రోజు ముందే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. బుధవారం అష్టమి కావటం.. ఆలోపే మంచి టైం ఉందని పండితులు తేల్చటంతో ఆమె అంత్యక్రియల్ని మంగళవారం సాయంత్రానికే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు అంతిమ సంస్కారానికి మంచి ముహుర్తంగా పండితులు తేల్చటంతో అంత్యక్రియల డేట్.. టైం మారిపోయాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News