మాజీ స‌ర్పంచ్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారెందుకు?

Update: 2019-07-01 05:46 GMT
ప‌ని పూర్తి చేయ‌ట‌మే ల‌క్ష్యం. అందుకు త‌గిన వారిని ఎంపిక చేసుకొని మ‌రీ వారితో ప‌ని పూర్తి చేసే అల‌వాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో కాస్త ఎక్కువే. ఆ మ‌ధ్య‌న సోష‌ల్ మీడియాలో ఒక రైతు ఆవేద‌నను చూసిన సీఎం కేసీఆర్‌.. స‌ద‌రు రైతుకు నేరుగా ఫోన్ చేసిన  వైనం ఎంత సంచ‌ల‌నంగా మారిందో తెలిసిందే.

తాజాగా అలాంటి ప‌నే చేశారు గులాబీ బాస్. జ‌గ‌దేవ‌పూర్.. మ‌ర్కుక్ మండ‌లాల ప్ర‌జ‌లు హైద‌రాబాద్ రావాలంటే చాలా దూరం ప్ర‌యాణించి రావాల్సి వ‌స్తుంద‌ని.. అందుకు భిన్నంగా హైద‌రాబాద్ కు ద‌గ్గ‌ర దారి గురించి చెప్పేందుకు ఒక మాజీ స‌ర్పంచ్ కు సీఎం కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

స్థానికులు ఒప్పుకొని.. రోడ్డుకు అవ‌స‌ర‌మైన భూమిని ఇస్తానంటే తానే రోడ్డు వేయిస్తాన‌ని.. అదే జ‌రిగితే మీ భూముల‌కు భారీగా రేట్లు పెరుగుతాయ‌న్న మాట కేసీఆర్ నోట రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక ముఖ్య‌మంత్రి నేరుగా ఒక మాజీ స‌ర్పంచ్ కు ఫోన్ చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

సిద్ధిపేట జిల్లా ములుగు మండ‌లం క్షీర‌సాగ‌ర్ మాజీ స‌ర్పంచ్ కు ఊహించ‌ని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫోన్చేవారు. జ‌గ‌దేవ్ పూర్.. మ‌ర్కూక్ మండ‌లాల‌కు చెందిన ప్ర‌జ‌లు హైద‌రాబాద్ రావాలంటే గౌరారం.. ములుగు మీదుగా రాజీవ్ ర‌హ‌దారి చేరుకొని అక్క‌డి నుంచి హైద‌రాబాద్ కు చేరుకుంటారు. ఇది వారికి చాలా దూరం. ఈ దూరాన్ని తగ్గించాల‌ని భావిస్తున్న సీఎం ఒంటిమామిడి నుంచి క్షీర‌సాగ‌ర్.. క‌మ‌లాబాద్.. న‌ర్సంప‌ల్లి.. అలియాబాద్.. అల్లీ న‌గ‌ర్ మీదుగా పాండురంగ ఆశ్ర‌మం వ‌ర‌కు రోడ్డు నిర్మించాల‌ని తాను అనుకుంటున్న‌ట్లు ఆయ‌న‌కు కేసీఆర్ చెప్పారు.

ఈ రోడ్డు వేయ‌టానికి అవ‌స‌ర‌మైన భూమిని ఆయా గ్రామాల రైతులు ఇస్తారా? అన్న విష‌యంపై క‌నుక్కోవాల‌ని కోర‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రోడ్డు వేసిన ప‌క్షంలో ఆ ప్రాంతంలోని భూముల‌కు భారీగా ధ‌ర‌లు పెరుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. సిద్ధిపేట జిల్లాలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మేన‌ల్లుడు హ‌రీశ్ తో క‌థ న‌డిపించ‌కుండా తానే నేరుగా ఫోన్ చేయ‌టం.. అది కూడా మాజీ స‌ర్పంచ్ తో మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మరి.. సీఎమ్మే నేరుగా ఫోన్ చేసి భూములు ఇస్తారా? అని అడిగిన నేప‌థ్యంలో స్థానికుల రియాక్ష‌న్ ఎలా ఉండ‌నుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News