వైసీపీకి రాధా గుడ్ బైకి!..కార‌ణం ఇదేన‌ట‌!

Update: 2019-01-24 07:54 GMT
వంగవీటి రాధా కృష్ణ ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వైసీపీకి రాజీనామా చేసిన త‌ర్వాత ఏ పార్టీలో చేర‌తారోన‌న్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా నెల‌కొన్న యాంజ్గైటీని అంత‌కంత‌కూ పెంచేసిన రాధా... కాసేప‌టి క్రితం నిర్వహించిన మీడియా స‌మావేశంలోనూ దానిపై క్లారిటీ ఇవ్వ‌కుండానే త‌న‌దైన శైలి ప్ర‌సంగంతో ముందుకు సాగారు. ప్ర‌సంగం మొత్తం వైసీపీ నుంచి తాను ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చాన‌న్న విష‌యాన్ని మాత్ర‌మే ప‌దేప‌దే చెప్పిన రాధాకృష్ణ‌... వైసీపీలో త‌న‌కు చాలా అవ‌మానాలు జ‌రిగాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో వైసీపీలో ఉంటే త‌న తండ్రి రంగా ఆశ‌యాల‌ను నెర‌వేర్చలేనన‌న్న భావ‌న‌తోనే ఆ పార్టీకి రాజీనామా చేశాన‌ని రాధా ప్ర‌క‌టించారు. కేవ‌లం త‌న తండ్రి ఆశ‌యాల‌ను నెర‌వేర్చడ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాన‌ని రాదా చెప్పుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీలో త‌న‌కు జ‌రిగిన అవ‌మానాల‌ను ఏక‌రువు పెట్టిన రాధా.. వాటిలో కొన్నింటిని ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. త‌న తండ్రి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్లాలంటే తాను ఎవ‌రి ప‌ర్మిష‌నో ఎందుకు తీసుకోవాల‌ని రాధా ప్ర‌శ్నించారు. అస‌లు విజ‌యవాడ‌లో దివంగ‌త సీఎం వైఎస్ విగ్ర‌హాన్ని కూల్చేస్తే... వైసీపీ నేత‌లు ఏ మేర‌కు స్పందించారో చెప్పాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. *అస‌లు నా తండ్రి విగ్రహావిష్క‌ర‌ణ‌కు నేనెవ‌రికి చెప్పి వెళ్లాలి* అని కూడా రాధా ప్ర‌శ్నించారు. వైసీపీ నేత‌లు త‌న‌ను బాగానే వాడుకున్నార‌ని - ఇత‌ర పార్టీల్లోని నేత‌ల‌ను వైసీపీలోకి తీసుకువ‌చ్చేందుకు ఆ పార్టీ నేత‌లు త‌న‌ను బాగానే వాడుకున్నార‌ని వ్యాఖ్యానించారు. అవ‌స‌రం మేర‌కు త‌న‌ను వాడుకున్న వైసీపీ... ఆ త‌ర్వాత అవ‌మానాల పాలు చేసింద‌ని కూడా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

తండ్రి లేనివాడివ‌న్న భావ‌న‌తోనే ఇన్నాళ్లు పార్టీలో ఉండ‌నిచ్చాన‌ని కూడా జ‌గ‌న్ వ్యాఖ్యానించార‌ని ఆరోపించిన రాధా... త‌న తండ్రి ఆశ‌య సాధ‌న వైసీపీలో ఉంటే సాధ్యం కాద‌నే భావ‌న‌కు వ‌చ్చాన‌ని చెప్పారు. వైసీపీలో చాలా ఆంక్ష‌లే ఉన్నాయ‌ని, ఆ ఆంక్ష‌ల‌తో త‌న తండ్రి ఆశ‌యాల‌ను నర‌వేర్చలేన్న భావ‌న‌తోనే ఆ పార్టీని వీడాన‌ని రాధా స్ప‌ష్టం చేశారు. ఈ సందర్భంగా జ‌గ‌న్‌పైనా రాధా ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. సొంత త‌మ్ముడిగా భావిస్తున్నాన‌ని చెప్పిన జ‌గ‌న్‌... ఆ త‌ర్వాత త‌న‌ను తీవ్ర అవ‌మానాల‌కు గురి చేశార‌ని ఆరోపించారు. త‌న ప‌ట్ల జ‌గ‌న్ వైఖ‌రి చాలా డిఫ‌రెంట్‌గా ఉంద‌ని చెప్పిన రాధా... అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాన‌ని చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న ప‌ద్ధ‌తిని మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా రాధా అభిప్రాయ‌ప‌డ్డారు.


Full View

Tags:    

Similar News