ప్రచారంలో కనిపించని విజయశాంతి.. ఏమైంది.?

Update: 2018-11-12 12:37 GMT
విజయశాంతి మళ్లీ యాక్టివ్  పాలిటిక్స్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు ఎన్నికల వేళ హల్ చల్ చేసిన ఆమె.. ఇప్పుడు ప్రచారంలో కనిపించడం లేదు. మూడు నాలుగురోజులు ప్రచారంలో హల్ చల్ చేసి ఆ తర్వాత కనుమరుగైపోయారు. ఇది కాంగ్రెస్ తోపాటు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది..

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా నియామకమైన విజయశాంతి ఇప్పుడు ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం కాంగ్రెస్ శ్రేణులను కూడా నెవ్వెరపరుస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఆమె రాజకీయాల్లో చరుకుగా పాల్గొనకుండా అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అభ్యర్థులే తేలకపోవడంతో ప్రచారం ఎలా చేస్తారని కొందరు వాదిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం ప్రచారంలో ఆమె కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె దూకుడు చూసి ప్రజలనుంచి మద్దతు కూడా వచ్చింది. అయితే రాములమ్మకు వస్తున్న ఆదరణ, మైలేజీని చూసి భయంతో కొందరు ఆమెకు అడ్డుపడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ లోని 9 నియోజకవర్గాల్లో ఆమె చేసిన ప్రచారానికి మంచి మార్కులు పడ్డాయి. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయశాంతి ప్రచారానికి వచ్చిన ఆదరణ చూసి తమ తమ నియోజకవర్గాలకు ఆమెను ప్రచారానికి తీసుకెళ్లాలని భావించారు. దాదాపు 45 నుంచి 50 నియోజకవర్గాల నుంచి ఆమెకు విజ్ఞప్తులు వచ్చాయి.  కానీ అక్టోబర్ 10 నుంచి ఆమె ప్రచారంలో కనిపించడం లేదు. ఆమెకున్న ఆదరణ చూసి కొందరు సీనియర్లు అడ్డుచెప్పారా.? లేక బ్రేక్ పడడానికి కారణమేదైనా ఉందా అన్నది కాంగ్రెస్ లో తీవ్ర చర్చ నడుస్తోంది.
    

Tags:    

Similar News