మీడియాకు ఏమైంది...?

Update: 2015-07-15 10:13 GMT
మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్... అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన వ్యవస్థ.. తప్పుజరిగితే ఎత్తిచూపి సరిదిద్దడానికి తోడ్పడాల్సిన యంత్రాంగం... కానీ దురదృష్టవశాత్తు ఏపీలో మీడియా ఆ లక్షణాలే కోల్పోయింది. పుష్కరాల్లో జరిగిన ప్రమాదంపై కొన్ని ఛానళ్లు వేస్తున్న కథనాలు చూస్తుంటే ఇదేం జర్నలిజం అనిపిస్తోంది. ఈ ప్రమాదానికి కారణం భక్తులేనన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. భక్తులకు క్రమశిక్షణ లేకపోవడం వల్ల... ఒకే రోజు అందరూ వచ్చేయడం వల్ల.. ఒకే చోటికి అంతా వచ్చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని... ప్రభుత్వం తప్పేమీ లేదన్నట్లుగా కథనాలు వేస్తున్నాయి.

    పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏమైనా సంఘాలున్నాయా... అంతా ఒకచోట కూర్చుని మాట్లాడుకుని ఎవరు ఏ రోజు వెళ్లాలి.. ఏ ఘాట్ కు వెళ్లాలి అనుకోవడానికి నిర్ణయించుకునే అవకాశం ఉందా..?లేదు కదా..దీనికీ ఒకరకంగా ప్రభుత్వానిదే తప్పు. జనప్రవాహాన్ని అంచనా వేయడంలో విఫలమవడం ఒక కారణమైతే... వచ్చినవారిని క్రమపద్ధతిలో ఘాట్లకు పంపించలేకపోవడమూ వైఫల్యమే. అంతేకాదు... రాజమండ్రి నగరంలోకి ఎంతమంది జనం వస్తున్నారు... ఏ ఘాట్ వద్ద ఎంత రద్దీ ఉందనేది నిత్యం గమనిస్తూ అందుకుతగ్గట్లుగా భక్తులను ఆపడం.. విడిచిపెట్టడం చేయాలి. బఫర్ జోన్లు ఉండాలి... లేదంటే భక్తులు విపరీతంగా వచ్చినప్పుడు చంద్రబాబు కోసం వారిని ఆపకపోవాల్సింది. ఇవన్నీ ప్రభుత్వం... ప్రభుత్వ సూచనలతో పనిచేసే అధికారుల వైఫల్యమే. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు చంద్రబాబు  ప్రభుత్వం వల్లే ఇలా జరిగింది రాజీనామా చేయాలి అని ఇప్పుడు చెప్పడం కాదు. పుష్కర ఏర్పాట్లు గవర్నమెంట్ ఎలా చేస్తుంది అని ఎప్పుడన్నా ఒక ప్రతిపక్ష నాయకుడు చూసాడ లేకపోతే సంగటన జరిగిన తరువాత సహాయం కోసం కార్యకర్తలును పంపార..లేకపోతే అధికారులకి ఏమయినా సలహాలు ఇచ్చారా . ఏమి చెయ్యలేదు ఎప్పుడు చంద్రబాబు దొరుకుతాడు అని ఎదురు చూసినట్టు ఉంది .. కానీ కొన్ని ఛానళ్లు ఇదంతా మరిచిపోయి భక్తులదే తప్పంటున్నాయి.
Tags:    

Similar News