గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ లో 3 ల‌క్ష‌ల వాహ‌నాలు తుక్కే!

Update: 2021-03-22 11:10 GMT
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో సుమారు మూడు ల‌క్ష‌లకు పైగా వాహ‌నాల‌ను త‌క్కు కింద ప‌క్క‌న పేట్టేయ‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు అధికారులు. వీటిలో ఎక్కువ‌గా ప్ర‌భుత్వ‌, ఇత‌ర సంస్థ‌ల వాహ‌నాలు ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఎందుకీ నిర్ణ‌యం తీసుకున్నార‌నేది కీల‌క ప్ర‌శ్న‌. విష‌యంలోకి వెళ్తే... ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో.. వాయుకాలుష్యం పెరిగిపోయింది. ఇక‌, వాతావ‌ర‌ణ మార్పుల ‌కు కూడా ఇది దారితీస్తోంది ఈ నేప‌థ్యంలో ఐక్య‌రాజ్య‌స‌మితి సూచ‌న‌లు.. ప్ర‌పంచ దేశాలు తీసుకున్న నిర్ణ‌యాల మేర‌కు మ‌న ద‌గ్గ‌ర కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారు.

వీటి ప్ర‌కారం.. 15 ఏళ్ల స‌ర్వీసు పూర్తి చేసుకున్న ప్ర‌జార‌వాణా, ప్ర‌జోప‌యోగ‌ వాహ‌నాలు, 20 ఏళ్లు పూర్తి చేసు కున్న వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు రిజిస్ట్రేష‌న్‌ను రెన్యువ‌ల్ చేయ‌రు. వాటిని తుక్కుగా ప‌రిగ‌ణించ‌ను న్నారు. ఈ విధానం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నోటిఫికేష‌న్ జారీ చేసింది. అయితే.. ఇక్క‌డ చిన్న వెసులుబాటు ఏంటంటే.. ఈ విధానాన్ని తొలుత... కేంద్ర‌, రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్ర‌భుత్వాల‌కు చెందిన వాహ‌నాల విష‌యంలోనే వ‌ర్తింప చేయ‌నున్నారు. అనంత ‌రం.. సాధార‌ణ ప్ర‌జ‌ల వాహ‌నాల‌కుకూడా వ‌ర్తింప‌జేయ‌నున్నారు.

ఇక‌, ఇలా తుక్కుగా ప‌రిణ‌గించే వాహ‌నాల విష‌యంలో వినియోగ‌దారుల‌కు కేంద్రం ఒక‌రాయితీని ప్ర‌క‌టిం చింది. కొత్త వాహ‌నాల కొనుగోలులో 5 శాతం రాయితీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో ఒక్క‌ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోనే మూడు ల‌క్ష‌ల‌కు పైగా వాహ‌నాలు తుక్కు కింద‌కే వెళ్లిపోతాయ‌ని.. వీటికి రిజ‌ర్వేష‌న్ రెన్యువ‌ల్ చేసేది ఉండ‌ద‌ని అంటున్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలో 64లక్షల వాహనాలు ఉంటే అందులో మూడు లక్షలకు పైగా వాహనాలు.. 20ఏళ్లు దాటినవిగా చెబుతున్నారు. రవాణ శాఖ రికార్డులు ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 20లక్షల వాహనాలు ఉంటే అందులో సగ భాగం గ్రేటర్‌ పరిధిలోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానాల్లో భాగంగా.. రెన్యువల్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ చేయకుండా తుక్కుగా చేసే చర్యలు తీసుకోనున్నారు.


Tags:    

Similar News