దేశంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ మరో కీలక ముందడుగు వేసింది. బ్రిటన్ కు చెందిన ఓ బ్యాటరీ సంస్థను కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే ఎన్నో సంస్థల్లో పెట్టుబడులు ఉన్న రిలయన్స్ కు మరో కంపెనీ ఈ సంస్థ నిలవనుంది. ఈ కొనుగోలుకు సంబంధించిన రెండు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. బ్రిటన్ కు చెందిన ఈ సంస్థ పేరు పారాడియన్ అని పేర్కొన్నారు. ఈ సంస్థ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ కొనుగోలు విలువ సుమారు వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని తెలిపిన రిలయన్స్.. ఆ సంస్థ సోడియమ్- అయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుందని పేర్కొంది. దీనిని ఆర్ఐఎల్ కొనుగోలు చేసినట్లు స్పష్టం చేసింది. కొనుగోలుతో పాటు ఆ కంపెనీ అభివృద్ధి చేయడంతో పాటు ఇతర కార్యకలాపాల కోసం మరి కొంత మొత్తాన్ని వెచ్చించినట్లు రిలయన్స్ తెలిపింది. ఈ మొత్తం సుమారు 250 కోట్ల రూపాయలుగా ఉందని వివరించింది. ఈ కొనుగోలుకు సంబంధించిన పూర్తి స్థాయి ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. దీనిలో భాగమైన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బ్రిటన్ లోని ఈ సంస్థ నడవనుంది.
ఈ ఒప్పందంతో బ్యాటరీల తయారీలో మన దేశాన్ని ముందు వరసలో నిల్చోబెట్టేందుకు కావలసిన సాంకేతిక లభిస్తుందని రిలయన్స్ తెలిపింది. అంతేగాకుండా కొత్త రకమైన, అత్యంత మన్నికైన బ్యాటరీలు తయారు చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు సంబంధించిన బ్యాటరీ అత్యంత మన్నికైనవని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. సోడియం, అయాన్ లతో రూపొందుకుంటున్న బ్యాటరీలతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేగాకుండా గుజరాత్ లో రిలయన్స్ భారీ ప్రాజెక్ట్ కు సన్నాహాలు చేస్తోంది. దీనికి ముఖేశ్ అంబానీ తండ్రి అయిన ధీరుబాయ్ అంబానీ పేరును పెట్టింది. ఇక్కడ ఫారాడియన్ లో ఉపయోగించే సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోనుంది.
రిలయన్స్ సంస్థ దేశంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. ఇటీవలే ఈ కంపెనీకి సంబంధించిన అధినేత మారే అవకాశం ఉన్నట్లు ముఖేశ్ అంబానీ తెలిపారు. దీనిపై మార్కెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తర్వాత అధినేత ఎవరు అనేది దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాలి అంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదని అంటున్నారు. మరో వైపు ముఖేశ్ కొడుకుల్లో ఒకరైనా ఆకాశ్ అంబాని పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది.