దేశీయంగా డేటా వినియోగం విషయంలో వినూత్న పథకాల్నిప్రవేశ పెట్టటమే కాదు.. దేశంలోనే అగ్రగామి నెట్ వర్క్ సంస్థగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ను తయారు చేయాలన్నది ముఖేశ్ అంబాని స్వప్నంగా చెబుతుంటారు. దేశ వ్యాప్తంగా 4జీ నెట్ వర్క్ హక్కులున్న రిలయన్స్ శరవేగంతో దూసుకెళుతోంది. జియో దెబ్బకు ఇప్పటికే ఐడియా సెల్యులార్ దారికి వస్తే.. అదే బాటలో బ్రాండ్ లీడర్ గా ఉన్న ఎయిర్ టెల్ సైతం రిలయన్స్ జియో విషయంలో ఆచితూచి అడుగులు వేయటంతో పాటు.. డేటా ఛార్జీలను తగ్గించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. డేటా రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించింది.
తాజాగా తాము షురూ చేసిన డేటా ప్యాక్ లపై పలు ఆఫర్లను ఎయిర్ టెల్ వెల్లడించింది. రూ.455లకు 4జీ కానీ 3జీ కానీ 2జీబీ డేటాను వినియోగించే వీలుంది. దాని స్థానే 3జీబీ డేటాను వాడుకునే వీలుంది. అదే సమయంలో రూ.655 రీఛార్జ్ పై ఇప్పుడున్న 3జీబీని.. 5 జీబీకి పెంచాలని భావిస్తున్నారు. అంతేనా.. రూ.989 రీఛార్జ్ పై 6.5 జీబీని వాడుకోవటానికి ఇప్పటివరకూ వీలుంటే.. ఇప్పుడది 10జీబీగా రావటం గమనార్హం. తాజాగా వెల్లడించిన ఆఫర్లు సైతం రిలయన్స్ జీయో పుణ్యమేనని తెలుస్తోంది.