ఈ అంకెను చూసినంతనే లెక్కేశారా? అవును.. అక్షరాల కోటీ అరవై లక్షలు. కేవలం ఒక్క నెల వ్యవధిలో తన సేవలు షురూ చేసిన స్వల్ప వ్యవధిలో భారత దేశ వ్యాప్తంగా జియో వినియోగదారుల్ని విపరీతంగా ఆకర్షించటమే కాదు.. వారి మనసు దోచుకొని.. తన సిమ్ కార్డును వారి మొబైల్స్ లో వేసుకునేలా చేసిందన్న వార్త ఇప్పుడు వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది.
ప్రపంచంలో మరే కంపెనీ సాధించలేని అద్భుత రికార్డును జియో సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒక బ్రాండ్ స్వల్ప వ్యవధిలో ఇంతమంది వినియోగదారుల మనసు దోచుకోవటం మామూలు విషయం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలే 4జీ సేవల్నిప్రారంభించిన రిలయన్స్ జియో సంచలనం సృష్టింస్తోన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో సిమ్ ల కోసం వినియోగదారులు రోడ్ల మీద క్యూలు కట్టి మరీ.. గంటల తరబడి వెయిట్ చేయటం తెలిసిందే. రోజులు గడుస్తున్నా జియో డిమాండ్ పెరుగుతున్నదే తప్ప.. ఏ మాత్రం తగ్గని పరిస్థితి.
డిసెంబరు వరకూ ఉచితంగా తమ సేవల్ని అందిస్తూ.. వాయువేగంతో పాటు.. కారుచౌకతో డేటాను అందిస్తామన్న ప్రచారంతో జియో సంచలనంగా మారింది. దీనికి తగ్గట్లే వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించి కేవలం నెల వ్యవధిలో 1.60 కోట్ల మంది వినియోగదారులు జియోను వాడేస్తున్నట్లుగా తాజాగా కంపెనీ పేర్కొంది. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది వినియోగదారులుగా చేసుకోవటమే జియో లక్ష్యమన్నసంగతి తెలిసిందే. కేవలం ఆ లక్ష్యాన్ని నెల వ్యవధిలో16 శాతం చేరుకోవటం సామాన్యమైన విషయం కాదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఓపెనింగ్ లోనే అదరగొట్టేసిన జియో.. రానున్న రోజుల్లో మరెంతగా చితక్కొట్టేస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/