నిన్నటి(బుధవారం) నుంచి ఒక వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారనుంది. మొన్నటికి మొన్న టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారి బాబుకు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పార్టీ మారుతున్నారన్న వార్త బ్రేకింగ్ గా మారింది. ఇందుకు ఆయన ఢిల్లీ పర్యటనను చూపిస్తున్న పరిస్థితి.
బీజేపీ నేతలతో మాట్లాడేందుకే అనగాని ఢిల్లీ వచ్చారని.. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా అనగాని స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తాను టీడీపీలోనే కంటిన్యూ అవుతానని చెప్పారు.
తన వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీ వచ్చాను తప్పించి బీజేపీలో చేరేందుకు కాదన్నారు. తానుకానీ.. బీజేపీ నేత నడ్డాను కలిసినట్లుగా నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. తన ఢిల్లీ పర్యటన గురించి పార్టీకి సమాచారం ఇచ్చే తాను వచ్చానని.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఓట్ల శాతం తగ్గిందన్నారు.
ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అన్యాయం చేసిందన్న అసంతృప్తిలో ఏపీ ప్రజలు ఉన్నారని.. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తనకు ఎంతో సన్నిహితుడైన ఎంపీ గరికపాటి మోహన్ రావు అనారోగ్యంతో ఢిల్లీలో ఉన్నారని.. ఆయన్ను పరామర్శించేందుకే తాను ఢిల్లీ వచ్చినట్లుగా చెప్పారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం ఏ మాత్రం సరికాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనగాని వెర్షన్ చూస్తుంటే.. బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదన్నట్లుగా ఉందని చెప్పక తప్పదు. మరి.. ఆయన మాటల్లో నిజం ఎంతన్నది రానున్న రోజుల్లో చెప్పక తప్పదు.