కేసీఆర్‌ కు నో టెన్షన్.. మళ్లీ గెలుపు ఆయనదే

Update: 2018-01-19 06:27 GMT
ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు అంటూ సర్వేలు చేసి రిపోర్టులు వెలువరిస్తున్న జాతీయ టీవీ ఛానల్ రిపబ్లికన్ టీవీ కేసీఆర్‌ కు చల్లని కబురు చెప్పి ఆయన టెన్షనంతా తొలగించింది. వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు క్లిష్టంగా ఉండొచ్చని టెన్షన్ పడుతున్న కేసీఆర్ కొద్దిరోజులుగా ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తూ కసరత్తు చేస్తున్నారు. అయితే, రిపబ్లికన్ టీవీ సర్వే మాత్రం కేసీఆర్ పెద్దగా కష్టపడకుండానే గెలుస్తారని.. గత ఎన్నికల్లో కంటే టీఆరెస్ కు ఒక్క సీటు మాత్రమే తగ్గుతుందని వెల్లడించింది. ప్రఖ్యాత జర్నలిస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్న చానల్ కావడంతో ఈ సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉండొచ్చన్న భావన రాజకీయ - పాత్రికేయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
    
కాగా తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉండగా 2014లో టీఆరెస్ 11 ఎంపీ సీట్లు - టీడీపీ 1 - వైసీపీ 1 - ఎంఐఎం 1 - బీజేపీ 1 కాంగ్రెస్ 2 గెలుచుకుంది. అయితే, టీడీపీ - వైసీపీ ఎంపీలతో పాటు కాంగ్రెస్ నుంచి ఒక ఎంపీ టీఆరెస్‌ లో చేరారు. ఈసారి బీజేపీ ఒక సీటు అదనంగా గెలుచుకుంటుందని ఈ సర్వేలో అంచనావేశారు. స‌ర్వే ప్ర‌కారం నిజామాబాద్‌ - క‌రీంన‌గర్‌ లలో ఒకటి బీజేపీ గెల్చుకుంటుంద‌ని స‌ర్వేలో తేలిన‌ట్లు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ న‌ల్గొండ‌తో పాటు ఖ‌మ్మం లేదా మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకునే చాన్స్‌ లు ఉన్న‌ట్లు స‌ర్వే వివ‌రాల ప్ర‌కారం అర్ధ‌మ‌వుతోంది
    
ఓటింగ్ శాతం విషయానికి వస్తే 2018 జనవరి నాటికి ఎన్డీయే ఓట్ల శాతం 22.8 శాతం నుంచి 28.5 శాతానికి పెరగ్గా…యూపీఏ ఓటింగ్ శాతం25.5 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గినట్లు రిపబ్లిక్ టీవీ అంచనా. అదే సమయంలో అధికార టీఆర్ ఎస్ ఓటింగ్ శాతం గత ఎన్నికల్లో 51.8 శాతం ఉండగా..ఇప్పుడది 46.3 శాతానికి తగ్గినట్లు అంచనా వేశారు.
Tags:    

Similar News