జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికపై చర్చ నడుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామనే దమ్ము ధైర్యం ఉంటే మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన సవాల్ కు మంత్రి కేటీఆర్ కూడా దీటుగానే స్పందించారు. ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. అయితే అది తన వ్యక్తిగత అభిప్రాయమని, నిర్ణయం మాత్రం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుందా లేదా అనే చర్చ సాగుతోంది.
జీహెచ్ ఎంసీ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే ఒకసారి మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణా రెడ్డి విజయం సాధించారు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించలేదు.
ప్రత్యక్ష ఎన్నిక అయితే తమకే లబ్ధి చేకూరుతుందని టీడీపీ భావిస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పదవిని కైవసం చేసుకున్నామని, ఇందుకు ప్రధాన కారణం సీమాంధ్ర ఓటర్లేనన్న అభిప్రాయం ఆ పార్టీలో ఉంది. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష ఎన్నిక జరిగితే టీఆర్ఎస్ మీద పీకల్లోతు కోపంలో ఉన్న సీమాంధ్రులంతా కలిసి టీడీపీకే ఓటు వేస్తారని, దాంతో మేయర్ సీటును దక్కించుకోవడం సులభం అన్నది ఆ పార్టీ భావన.
అయితే, నగరంలో సీమాంధ్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. వారి కంటే ముస్లిములు, తెలంగాణ ప్రజలే ఎక్కువని, ఈ రెండు వర్గాలూ కలిసి ఎవరినైనా ఓడించవచ్చని, ప్రత్యక్ష ఎన్నిక అయితే తమకు లబ్ధి చేకూరుతుందని టీఆర్ ఎస్ భావిస్తోంది. అయితే, ప్రత్యక్ష ఎన్నికపై కాంగ్రెస్ ఇప్పటి వరకు తన అభిప్రాయాన్ని వెలువరించలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.