తెలంగాణ రాజకీయాల్లో అసలైన ఆట మొదలైందంటూ ఈ మధ్యన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యకు అసలుసిసలు అర్థం ఇదే అన్నట్లుగా మారింది తాజా ఉదంతం. తన మాటలతో రాజకీయ ప్రత్యర్థులకు చుక్కలు చూపించే అలవాటున్న మంత్రి కేటీఆర్‌కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఎదురైందన్నట్లుగా తాజాగా పరిస్థితి చోటు చేసుకుంది. టీటీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ నిన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రేవంత్ ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు.. కార్యకర్తల్ని టీఆర్ఎస్ లో చేర్చిన సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాల కాంగ్రెస్ లోకి మరో దొంగ రేవంత్ రెడ్డి చేరాడంటూ మండిపడ్డారు. రైఫిల్ రెడ్డి ఇప్పుడు పిట్టల దొరగా మారాడని ఎద్దేవా చేశారు. దీనికి బదులు అన్నట్లుగా తన మాటల్ని ధీటుగా తిప్పి కొట్టేందుకు కేటీఆర్‌కు చెందిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రేవంత్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తనను స్కాం స్టార్ గా అభివర్ణించిన కేటీఆర్ ఆరోపణకు ఫేస్ బుక్ వేదికగా చేసుకున్న రేవంత్.. ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం అన్న శీర్షికతో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ ఫోటో ప్రత్యేకత ఏమిటంటే.. 2016లో అధికారిక కార్యక్రమంలో అనధికారికంగా తేజా రాజు సన్నాఫ్ సత్యం రామలింగరాజుతో మలేషియా ప్రధానితో కలిసి దిగిన ఫోటోను రేవంత్ పోస్ట్ చేశారు.
సత్యం రామలింగరాజు కొడుకుతో కలిసి కేటీఆర్.. మలేషియా ప్రధానితో మంతనాలు ఆడారని.. అయితే అధికారిక పర్యటనల్లో ఎక్కడా సత్యం రామలింగరాజు కుమారుడి ఫోటో కనిపించదని రేవంత్ పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయిల కుంభకోణాలకు పాల్పడిన వ్యక్తి కుమారుడితో మలేషియా ప్రధానితో చేసిన మంతనాలు ఏమిటంటూ ప్రశ్నించిన రేవంత్.. తనను స్కాం స్టార్ గా నిన్న రంకెలేస్తూ ఆవేశ పడ్డారని.. ఇప్పుడు ఎవరు స్కాం స్టార్లతో తిరుగుతున్నారనటానికి తిరుగులేని సాక్ష్యం ఈ ఫోటో అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్ అంటూ కేటీఆర్ కు రేవంత్ రెడ్డి ఘాటుగా రిప్లై ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. మలేషియా ప్రధానితో సత్యం రామలింగరాజు కొడుకుతో రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏమిటో చెప్పాలన్నారు.
ఓటుకు నోటు కేసుతో తెలంగాణ రాష్ట్ర పరువును రేవంత్ తీశాడంటూ మంత్రి కేటీఆర్ నిన్న విరుచుకుపడగా.. దీనికి కౌంటర్ అన్నట్లుగా మంత్రి కేటీఆర్ ను డిఫెన్స్ లో పడేసేలా రేవంత్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.