కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి అరెస్టు.. మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సహా ఆయన సోదరుడిపై కేసు నమోదు నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వ నెక్ట్స్ టార్గెట్ రేవంత్ రెడ్డే అయి ఉండవచ్చని ఊహాగానాలు విన్పిస్తుండగా...అనూహ్యరీతిలో అదే పరిణామం చోటుచేసుకుంది. అయితే ఇది ఓటుకు నోటు కేసులో కాదు...ఆయన భాగస్వామ్యం ఉన్న జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో. 15రోజుల్లో జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరవ్వాలని రేవంత్ రెడ్డి తో పాటు 13 మంది కి నోటీసులు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో....మహాకూటమి ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే... ఆపద్ధర్మ ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై గతంలో నమోదైన కేసులను తిరగదోడుతుందనే ప్రచారం జోరందుకుంది.
జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీ కేసులో రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసు జారీ చేశారు. 41 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చారు. తప్పుడు డాక్యుమెంట్లతో అక్రమంగా సొసైటీలో కొంతమందికి స్థలాలు కేటాయించడంలో రేవంత్ రెడ్డిది కీలక పాత్ర అని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2003 నుంచి 2005 వరకు ఉన్న హౌజింగ్ సొసైటీ కమిటీకి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీస్ ఇచ్చారు. కాగా దీనికి రేవంత్ రెడ్డి అనూహ్యరీతిలో స్పందించారు. తాను ఎన్నికల బిజీలో ఉన్నందున విచారణకు రాలేనని జూబ్లీహిల్స్ పోలీసులకి రేవంత్ లేఖ రాశారు. అయితే ఈ నోటీసుల తదుపరి పరిణామం ఓటుకునోటులో అరెస్టేనని అంటున్నారు.
ఓటుకునోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఇది ట్రయల్ అని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో...ఆ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి పాత్రదారిగా ఉండి సాగించిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంలో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాకుండా స్టీఫెన్ సన్ తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్ కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.