రేవంత్‌ - మోత్కుప‌ల్లి కాంగ్రెస్ నేత‌ను ఎందుకు క‌లిశారో!

Update: 2017-06-24 07:37 GMT
తెలంగాణ టీడీపీ - కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. కొద్దికాలం క్రితం ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉంటుంద‌నే వార్త‌లు ప్ర‌చారం అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా దీనికి ముంద‌డుగు అన్న‌ట్లుగా తెలుగుదేశం పార్టీ కార్యాల‌యంలోనే కీల‌క స‌మావేశం జ‌రిగింది. తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి - సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే - అసెంబ్లీ విప్ సంపత్‌ కుమార్‌  ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామానికి దారితీసింది.

రేవంత్‌ రెడ్డికి ఫోన్ చేసి మ‌రీ టీడీపీ ఆఫీసుకు వెళ్లిన‌  సంపత్‌ కుమార్ అక్క‌డే ఇద్ద‌రు ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం అయిన‌ట్లు  స‌మాచారం. రేవంత్ రెడ్డి - మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ కు వెళ్లిన సంద‌ర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై వారి మధ్య సుదీర్ఘమైన చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలు, టీఆర్‌ ఎస్‌ పాలన - మియాపూర్‌ భూములు - ఎమ్మార్పీఎస్‌ ఉద్యమంతోపాటు రాజకీయ సమీకరణాలపై చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని వివిధ ప్ర‌జా స‌మ‌స్య‌లు, దానిపై స్పందించాల్సిన విధానంపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. కాగా,రెండు విభిన్న పార్టీలకు చెందిన నేతలు ఒక పార్టీ కార్యాలయంలో భేటీ కావడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మ‌రోవైపు టీడీపీ వ‌ర్గాలు మాత్రం ఈ ఆస‌క్తిక‌ర‌మైన భేటీని త‌క్కువ చేసి చూపే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి - సంప‌త్ కుమార్ ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు చెందిన నేతలు కావడంతో పూర్వ‌పు ప‌రిచ‌యం కార‌ణంగా స్నేహపూర్వకంగా వారివురూ కలిశారని ఇందులో రాజకీయ విశేషాలు ఏమీ ఏమీలేవని ఎన్టీఆర్‌ ట్రస్టు వర్గాలు అంటున్నాయి. ఇదే అంశంపై సంపత్‌ ను ఓ మీడియా సంస్థ ఫోన్లో సంప్రదించగా రేవంత్‌ - మోత్కుపల్లిని కలిసిన మాట వాస్తవమేనన్నారు. ఈ సందర్భంగా తాము పలు రాజకీయాలపై చర్చించామన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకే త‌మ భేటీ జ‌రిగింద‌ని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News