తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - టీఆర్ ఎస్ పార్టీపై ఒంటికాలిపై లేచే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ - శాసనసభ పక్షనేత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన పోరాట పంథాను మార్చుకొని ముందుకు పోయేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో టీడీపీ విస్తరణకు ప్రయత్నించినప్పటికీ పెద్దగా అనుకూలత లేకపోయినప్పటికీ రేవంత్ తన ప్రయత్నం మాత్రం వదిలివేయడం లేదు. ఇన్నాళ్లు మీడియా అండగతో హైదరాబాద్‌లో పోరాటం చేసిన రేవంత్ ఇప్పుడు ప్లాన్ `బీ`ని సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమయ్యారు. గతంలో విజయవంతమైన ఫార్ములా అయిన పాదయాత్రను రేవంత్ తన కార్యాచరణకు ఆయుధంగా వాడుకోనున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచిపోయిందని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూం పథకం, ఉద్యోగుల భద్రత, జర్నలిస్టుల భద్రత లాంటి హామీలను దాటవేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. కుటుంబ పాలనతో కేసీఆర్ రాష్ట్రాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకొని పోరాటం చేస్తానన్నా రు. ప్రజా సమస్యలపై త్వరలోనే పాలమూరులోని అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు లేకుండా బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని తుంగలో తొక్కారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. రుణమాఫీ చేయకుండా రైతులను నట్టేట ముంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/