బీజేపీని తుస్సుమ‌నిపించిన రేవంత్‌రెడ్డి

Update: 2021-07-05 06:56 GMT
తెలంగాణ‌లో పుంజుకుంటామ‌ని.. స‌త్తా చాటుతామ‌ని.. సొంత బ‌లంతోనేఅదికారంలోకి వ‌చ్చేస్తామ‌ని.. ప‌దే ప‌దే చెబుతున్న రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు ఖంగు తినిపించేలా కామెంట్లు చేశారు.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న యువ నేత‌, పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయ‌న ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీ.. 1983 నుంచి గెల‌వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

అయితే.. ఇప్పుడు తాను ఒక ప్ర‌య‌త్నం చేస్తాన‌ని.. గెలిచేందుకు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తాన‌ని.. అన్నారు. ఈ క్ర‌మంలో స‌ర్వ‌శ‌క్తులు వ‌డ్డుతాన‌ని చెప్పారు. అంతేకాదు.. ఈ ఉప ఎన్నిక‌లోవిజ‌యం కోసం.. అధికార టీఆర్ ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు భారీ ఎత్తున డ‌బ్బుల‌తో రంగంలోకి దిగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. దీనికి సుమారు.. 200 కోట్ల‌ను ఆయా పార్టీ లు క‌ర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నాయ‌ని అన్నారు. అయితే.. తాను మాత్రం.. త‌న పార్టీ శ్రేణుల‌తోనే రంగంలోకి దిగి.. పార్టీని గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని రేవంత్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తాను చేసే ప్ర‌య‌త్నంతో రాత్రికి రాత్రి అద్భుతాలు జ‌రిగిపోతాయ‌ని భావించ‌డం లేద‌న్నా రు. అయితే.. త‌న ల‌క్ష్యం మాత్రం 2023 ఎన్నిక‌లేన‌ని చెప్పారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో బీజేపీ గురించి మాట్లాడుతూ.. హుజూరాబాద్‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ట్టు ఆ పార్టీ నేత‌లు ప్ర‌క‌టిస్తున్నా.. ఇది వాస్త‌వం కాద‌ని.. అన్నారు. ఎందుకంటే.. ఇక్క‌డ నుంచి బీజేపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌కు నియోజ‌క‌వ‌ర్గంపై గ‌ట్టి ప‌ట్టుంద‌ని.. ఆయ‌న 2004 నుంచి విజ‌యం సాదిస్తున్నార‌ని.. కేవ‌లం జెండా మాత్ర‌మే మారింది త‌ప్ప‌.. ఆయ‌న ఓటు బ్యాంకు.. ఆయ‌న ఇమేజ్ చెక్కుచెద‌ర‌లేద‌ని చెప్పారు.

సో.. హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే..అది ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్ కిందే చూడాల్సి ఉంటుంద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. దీనికి బీజేపీ విజ‌యంగా చూడ‌లేమ‌న్నారు. ఇప్ప‌టి ఇక్క‌డ లేని పార్టీ.. ఈట‌ల ను ఎలా గెలిపిస్తుంద‌ని అన్నారు. ఈట‌ల గెలిచినా.. బీజేపీకి క్రెడిట్ కాద‌న్నారు. ఇది సంపూర్ణంగా ఈటల స‌త్తా చాటుకున్న‌ట్టే అవుతుంద‌ని తెలిపారు. సో.. రేవంత్ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల‌ను గెలిపించుకుంటాం.. అంటున్న నేత‌లు.. లోలోన ఉడికిపోతున్నారు.  వాస్త‌వంఅయితే.. రేవంత్ చెప్పిన మాట‌లేనిజ‌మ‌ని.. ఈట‌ల విజ‌యం ద‌క్కించుకుంటే.. అది ఆయ‌న‌కే సొంత‌మ‌ని విశ్లేష‌కులు సైతం వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News