ఢిల్లీ హత్యోదంతంపై ఆర్జీవీ కామెంట్స్.. అలా హింట్ ఇచ్చేస్తున్నాడా..?

Update: 2022-11-17 09:01 GMT
ఢిల్లీలో జరిగిన శ్రద్ధ హత్యోదంతంపై ఇప్పటికే మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నాయి. శ్రద్ధని దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా చేసి.. శరీర భాగాలన్నీ అక్కడక్కడ పడేయడం పెద్ద సంచలనంగా మారింది. దీనిపై రోజూ టీవీల్లో ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తూ వారి రేటింగ్ లు పెంచుకుంటున్నాయి ఛానెల్స్. కేసు విచారణలో ఉండగా ఏ చిన్న క్లూ దొరికినట్టు సమాచారం వచ్చినా సరే దాని గురించి స్పెషల్ స్టోరీస్ చేస్తున్నారు. ఈ క్రూరమైన హత్యోదంతంపై మీడియా చేస్తున్న హడావిడిపై ఆర్జీవి కన్ను పడ్డది.      

ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పనిని తన కోణంలో చూస్తాడు ఆర్జీవి. బహుశా  అది ఆర్జీవికి మాత్రమే సాధ్యమధ్యమవుతుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా శ్రద్ధ దారుణ హత్య విషయంపై ఆర్జీవి తన మార్క్ కామెంట్స్ చేస్తున్నారు.

కఠిన చట్టాలు ఉన్నా సరే నేరస్తులు నేరాలు చేయడం మానడం లేదు. అందుకే మరణించిన వారి ఆత్మలు తిరిగొచ్చి వారిని చంపితే భయం ఉంటుందని.. దేవుడికి తను చేసే విన్నపం ఇదే అని ఆర్జీవి ట్వీట్ చేశాడు. అంతేకాదు చనిపోయిన వారి ఆత్మకు శాంతి కోరకుండా వారి ఆత్మ చంపిన వారిని పీసులుగా చేయాలని కూడా మరో ట్వీట్ చేశారు.      

ఆర్జీవి చేసిన ట్వీట్ చూస్తే ప్రేక్షకులు ఆయన తీయబోతున్న సినిమా హింట్ ఇస్తున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో యాక్టర్ సుసైరాజ్ తన ప్రియుడు నీరజ్ గ్రోవర్ ని చంపి ముక్కలు ముక్కలుగా ప్యాక్ చేసి పడేసింది. దీని ఆధారంగానే ఆర్జీవి నాట్ ఏ లవ్ స్టోరీ సినిమా తెరకెక్కించాడు. ప్రణయ్ హత్యోదంతం కూడా సినిమా రూపంలో తీసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశ సంఘటన కూడా ఆర్జీవి సినిమా తీశాడు.  

ఢిల్లీ హత్యోదంతంపై అర్జీవి చేసిన ట్వీట్స్ చూస్తుంటే ఆయన ఈ హత్యోదంతంపై కూడా సినిమా చేస్తారేమో అని డౌట్ పడుతున్నారు ఆడియన్స్. తాను ఏం చెప్పదలచుకున్నా మొహమాటం లేకుండా చెప్పే ఆర్జీవి తను సినిమా తీస్తానని డైరెక్ట్ చెప్పేస్తాడు.

కాబట్టి ఢిల్లీ హత్యోదంతంపై ఆర్జీవి సినిమా తీస్తారని అనుకోలేం కానీ అతని కామెంట్స్ చూసిన నెటిజన్లు మాత్రం వర్మ సినిమా తీసేందుకు మరో మంచి కంటెంట్ దొరికింది అంటున్నారు. అయితే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఇలాంటి సినిమా తీసి ప్రజలని భయపెట్టొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News