మాతృదినోత్సవం రోజున సామాజిక హక్కుల కార్యకర్త, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ ఇరోం షర్మిల కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరు మల్లేశ్వరంలోని క్లౌడ్‌నైన్ గ్రూప్ హాస్పటల్స్‌లో ఇరోం షర్మిలకు పండంటి కవల ఆడపిల్లలు పుట్టారు. కవలలిద్దరికీ నిక్స్ శక్తి, ఆటామన్ తారా అని నామకరణం చేశారు. తల్లీపిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ శ్రీప్రద వినేకర్, షర్మిల సన్నిహితురాలు దివ్యభారతి ఫేస్‌బుక్ పేజీలో తెలిపారు.
16 ఏళ్ల పాటు సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేసిన ఇరోం షర్మిల 2016లో దీక్ష విరమించారు. ఆ తర్వాత పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇరోం షర్మిల ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017 ఆగస్టు 17న ఇరోం షర్మిల, బ్రిటీష్ పౌరుడు డెస్మండ్ కౌటినోను పెళ్లి చేసుకున్నారు.