లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా రిషి సునక్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా.. బ్రిటన్ ప్రధానిగా.. భారత సంతతికి చెందిన రిషి సనక్ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం భారతీయులను ఉప్పొంగేలా చేసింది. ఈ రోజు బ్రిటన్ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించబడిందనే చెప్పాలి. ఎందుకంటే మొదటి ఆసియా మూలాలకు చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. దీపావళి పండుగ రోజమే మన భారతీయుడు మనల్ని పాలించిన దేశానికి ప్రధాని కావడం విశేషం.
రిషి సునక్ మొదటి మైనారిటీ పీఎంగా.. టోరీస్ నాయకుడుగా ఆవిర్భవించాడు.. బ్రిటన్ లోని భారతీయులంతా రిషి సునక్ ప్రధాని కావడంతో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు.. కానీ రిషి సునక్ ముందు చాలా సవాళ్లున్నాయి. 42 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎన్నికైన మన రిషికి మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదాం..
ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిన బ్రిటన్ దేశ ప్రజలకు ప్రస్తుతం రిషి సునక్ పైనే బోలెడు ఆశలున్నాయి. బ్రిటన్ లో తీవ్రమైన మార్పులు కొంచెం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో రిషి సునక్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రిగా అత్యంత పిన్న వయస్కుడు (42) రిషి కావడం విశేషం. ఆ పదవిని చేపట్టిన మొదటి భారతీయ మూలం ఉన్న వ్యక్తి. "నేను మన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని, మా పార్టీని ఏకం చేసి మన దేశానికి మరోసారి అధికారం అందించాలని కోరుకుంటున్నాను" అని రిషి ఒక ప్రకటనలో తెలిపారు.
రిషి సునక్ తదుపరి ప్రధానమంత్రి అని స్పష్టమైన తర్వాత బ్రిటన్ కరెన్సీ విలువ ‘పౌండ్’ కొద్దిసేపు పెరిగింది. నాయకత్వం కోసం పోటీ సమయంలో లిజ్ ట్రిస్ పన్ను తగ్గింపు ఎజెండాను రిషి గతంలో విమర్శించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చిన తర్వాతే పన్నులు తగ్గిస్తామని చెప్పారు.
గత ఏడు నెలల్లో యూకేలో రిషి సునక్ మూడో ప్రధానమంత్రి కాగా, లిజ్ ట్రస్ దేశంలోనే అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉండి వైదొలిగిన వ్యక్తిగా నిలిచారు. పౌండ్ పతనానికి దారితీసిన ఆర్థిక బడ్జెట్ ను ఆమె ప్రవేశపెట్టారు. దీంతో దేశం మరింత అప్పుల పాలైంది. అప్పుల ద్వారా నిధులు సమకూర్చినా కూడా పన్ను తగ్గింపు బడ్జెట్ మార్కెట్లలో షాక్‌లను కలిగించాయి. బ్రిటన్ ను మరింతగా ఆర్థిక మాంద్యంలోకి నింపింది. అవుట్‌గోయింగ్ ప్రధాన మంత్రి ట్రస్ రాజీనామా చేశారు.
రిషి సునక్ భార్య ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి. మన భారతీయుడే.. ఇక్కడి మూలాలున్న వ్యక్తియే రిషి. సామాన్యుడిగా మొదలైన రిషి సునాక్ తన కృషి, పట్టుదలతో బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎదిగారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త తరం నాయకుడిగా పేరు తెచ్చుకొని బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి చరిత్ర సృష్టించారు. బ్రిటన్ సంక్షోభం వేళ ఆర్థిక మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో రిషి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉష, యశ్ వీర్. భారత్ లోని పంజాబ్ లో రిషిసునాక్ తల్లిదండ్రుల మూలాలున్నాయి. వారు టాంజానియా, కెన్యా నుంచి బ్రిటన్ కు వలసవచ్చారు. సునాక్ తండ్రి యశ్ వీర్ వైద్యులు కాగా.. తల్లి మెడికల్ షాప్ నిర్వహించేవారు. ఆక్స్ ఫర్డ్ లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ అభ్యసించారు. తొలిసారి 2015లో రిచ్ మండ్ ఎంపీగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. 2017, 2019లలోనూ తిరిగి ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా నియమితులై ఈ ఏడాది జులై వరకూ కొనసాగిన విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.