బీహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. నేటితో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఫలితాలు రావాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం మొదలు అయ్యింది మొదలు ఆర్జేడీ వర్సెస్ జేడీయూ, బీజేపీ హోరా హోరి ఎన్నికల ప్రచారం జరిగింది. నేడు చివరి దశ పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మాధేపూరలో మద్య వయస్కుడు అయిన ఒక వ్యక్తిని జేడీయూకు ఎలా ఓటు వేశావు అంటూ ఆర్జేడీ కార్యకర్తలు చితక బాదారు. ఆ వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీప్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆర్జేడీ అంటేనే బీహార్ లో గుండా రాజ్యం అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆర్జేడీ కార్యకర్తలు తనను కొట్టారని తాను బాణం గుర్తుకు ఓటు వేశాను అంటూ చెప్పడం వల్లే వారు కొట్టారు అంటూ బాధితుడు చెప్పడం ఆ వీడియోలో చూడవచ్చు. కొన్ని రోజుల క్రితం ఆర్జేడీ సోషల్ మీడియా ద్వారా బీజేపీ ఓటర్లకు డబ్బులు పంచుతున్న వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోకు టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా బీజేపీ ఈ వీడియోను విడుదల చేసినట్లుగా అనిపించింది. బీహార్ ప్రజల ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యయి. మరికొన్ని గంటల్లో బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Full View Full View Full View