కలెక్షన్ కింగ్ అనగానే తెలుగువాళ్లందరికీ మోహన్ బాబే గుర్తుకొస్తాడు. ఐతే వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా మాత్రం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కాదంటోంది. అసలైన కలెక్షన్ కింగ్ చినబాబు.. అదేనండీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ బాబే అంటోందామె. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫైళ్ల మీద సంతకాలు పెట్టడంలో బిజీగా ఉంటే.. లోకేష్ వాటి ద్వారా సూట్ కేసులు నింపే పనుల్లో తీరిక లేకుండా ఉన్నాడని ఆమె ఆరోపించారు. లోకేష్ పుణ్యమా అని తెలుగు ప్రజలు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనే సంగతి మరిచిపోయి లోకేష్ బాబునే నిజమైన కలెక్షన్ కింగ్ అనుకుంటుఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ చంద్రబాబు - లోకేష్ బాబు ఎక్కడ భూములు దొరికినా బినామీ బాబుల పేరిట దోచుకుంటున్నారన్నారు. చంద్రబాబు అవినీతి అనకొండని - లోకేష్ బాబు కమీషన్ల కొండచిలువ అంటూ తనదైన శైలిలో ఆమె పంచ్ డైలాగ్ విసిరారు. తనకున్నంత అనుభవం ఎవరికీ లేదని చెప్పుకునే ఆయన అవినీతిలో ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు. అంత అనుభవం మరెవరికీ రాదన్నారు. డ్వాక్రా సంఘాల వెన్నెముక విరిచి కూర్చోబెట్టిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో డ్వాక్రా మహిళల వద్దకు ఓట్ల కోసం వెళితే పేడ - నీళ్లతో సన్మానం తప్పదని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.