వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల ఆందోళనలో భాగంగా అక్కడికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పై దాడిని ఆమె ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి చేసింది రైతులు కాదని.. టీడీపీ కార్యకర్తలేనని.. ఆయన హత్యకు పక్కా ప్లాన్ చేశారని రోజా ఆరోపించారు. రైతుల ముసుగులో ఆయనను చంపేందుకు కుట్ర పన్నారని సంచలన కామెంట్స్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి కారును ధ్వంసం చేశారంటే ఎంత బలంగా కొట్టారో అర్థమవుతోందని.. ఖచ్చితంగా మా ఎమ్మెల్యేను చంపేందుకు ప్రయత్నించారని రోజా ఆరోపించారు. పిన్నెల్లి ఇప్పటివరకు రాజధాని పై స్పందించలేదని.. ఆయనపై దాడి చేయడం వెనుక ఆయనను చంపించాలనే కుట్ర ఉందని ఆరోపించారు. మూడు రాజధానులను వ్యతిరేకించిన గంటా, కేఈలపై ఎందుకు దాడి చేయలేదని రోజా ప్రశ్నించారు.
టీడీపీ కుట్రదారులు వచ్చారని.. పరిటాల రవి సమయంలోనూ ఇలాగే అరాచకాలు చేశారని.. అల్లర్లు అరాచకాలు సృష్టించడం.. దానిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు ప్రాణభయం ఉందని.. రైతుల ముసుగులో గుండాగిరి చేసేవాళ్లపై చర్య తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. మనుషుల ప్రాణాలు తీస్తామంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.