ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి మెగా ఫ్యామిలీ లక్ష్యంగా తీవ్ర విమర్శలకు దిగారు. సినిమా ఇండస్ట్రీ అంతా తామేనని మెగా ఫ్యామిలీ అనుకుంటారని.. మరి వారు మా అధ్యక్షుడిగా నిలబెట్టిన ప్రకాష్ రాజ్ ను ఎందుకు గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అంటే మెగా ఫ్యామిలీపై భయం ఉందని.. ప్రేమ లేదనడానికి ప్రకాష్ రాజ్ ఉదంతమే నిదర్శనమన్నారు. గతంలో ప్రకాష్ రాజ్ ను తెలుగు సినిమాల నుంచి బహిష్కరించి ఆయనను దెబ్బకొట్టింది కూడా మెగా ఫ్యామిలీయేనని రోజా ఆరోపించారు.
హైపర్ ఆది, ఇతర నటులు తమపై విమర్శలు చేయడాన్ని పట్టించుకోబోనన్నారు. వారిని వెనుక ఉండి మెగా ఫ్యామిలీయే మాట్లాడిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. మెగా ఫ్యామిలీ ఆరుగురు ఏడుగురు హీరోలు ఉన్నారని.. వారు చెప్పినట్టు చేయకపోతే తమకు సినిమాలు, ఇతర అవకాశాలు ఉండవనే చిన్న నటులు తనపై విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. మంత్రులకు వారి శాఖల పేర్లు ఏంటో కూడా తెలియవని అనడాన్ని రోజా ఖండించారు. తమకు శాఖల పేర్లు కూడా తెలియకపోతే మంత్రలుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.
కోట శ్రీనివాసరావు, బాబూమోహన్, శారద, బాలకృష్ణ, తాను ఎన్నికల్లో గెలిచామని.. తానయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిని కూడా అయ్యానని రోజా గుర్తు చేశారు. మరి మెగా ఫ్యామిలీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతోందని నిలదీశారు. వారిపై ప్రజల్లో అభిమానం లేదన్నారు. అభిమానం తమకులాగా గెలిచేవారని రోజా వ్యాఖ్యానించారు.
అలాగే తనను డైమండ్ రాణి అని వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్ పై రోజా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ జోకర్ అని, ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ అన్నారు.
''టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి 7–8 మంది హీరోలున్నారు. వారికి వ్యతిరేకంగా నిలబడితే సినిమా ఆఫర్లు రావు. అందుకే ఈ జబర్దస్త్ నటీనటులు వారి వెనుక ఉన్నారు'' అని అన్నారు. ''ఇది పూర్తిగా మెగా ఫ్యామిలీకి ఉన్న భయం వల్లనే తప్ప ప్రేమ వల్ల కాదు. మెగా ఫ్యామిలీని ఇండస్ట్రీ నిజంగా ప్రేమిస్తుంటే, మా ఎన్నికల్లో బలపరిచిన ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఎందుకు గెలవలేదు? వైసీపీ మంత్రులపై ఈ మాటల దాడి వెనుక మెగా ఫ్యామిలీ హస్తం ఉంది' అని రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రోజా తాజా వ్యాఖ్యలపై జబర్దస్త్ నటులు ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం మున్సిపాలిటీ కుప్పతొట్టికి, రోజా నోటికి తేడా ఏం లేదని మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.