వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఏపీ అధికారపక్ష ఎమ్మెల్యే అనితను దూషించారంటూ రోజాపై ఆరోపణలు ఉండటం.. ఆమెపై ఏడాది సస్పెన్షన్ ను విధించటం తెలిసిందే. తనపై విధించిన సస్పెన్షన్ గడువుముగియటంతో అసెంబ్లీకి వచ్చిన ఆమెపై చర్యలు తీసుకునేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న వేళ.. రోజా రియాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె సరికొత్త వాదనను వినిపించారు. సభాధ్యక్షుడైన స్పీకర్ కు తెలికుండా.. ఆయనకు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ వీడియో ఎలా బయటకు వచ్చింది?అనిప్రశ్నిస్తున్నారు రోజా. తాను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నఆమె.. తాను చేశానని చెబుతున్న వ్యాఖ్యల్ని.. అక్కడక్కడా కట్ చేసి.. వీడియో తయారు చేశారే తప్పించి.. పూర్తి వీడియో చూస్తే అసలు విషయం అర్థమవుతుందన్నారు.
స్పీకర్ కు తెలీకుండా మీడియాకు వీడియోలు లీక్ చేసిన మంత్రి కాల్వ శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని.. కానీ.. అలా చేయటం లేదని వ్యాఖ్యానించారు. లీకు వీడియో ఆధారంగా తనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్న ఆమె.. జగన్ ను తిట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. తనపై ఆరోపణలు చేసే వారు.. తొలుత మొత్తం వీడియో చూడాలన్నారు. తనపై మరోసారి సస్పెన్షన్ విధిస్తే.. తాను సుప్రీంకోర్టుకు వెళతానని వెల్లడించారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని.. వీడియో మొత్తాన్ని విడుదల చేస్తే అసలు విషయం ప్రజలకు అర్థమవుతుందన్నారు. తాను తప్పు చేసినట్లుగా తేలితే.. ప్రజలు విధించే శిక్షను తాను సిద్ధమని చెప్పిన ఆమె.. అవసరమైతే రెండేళ్లు కాదు.. మూడేళ్లు సస్పెన్షన్ కు తాను సిద్ధమని ప్రకటించారు. తప్పు ఎవరు చేశారో తెలిపే వీడియోల్ని పూర్తిగా విడుదల చేయాలని రోజా డిమాండ్ చేస్తున్నారు. మరి.. రోజా డిమాండ్లపై ఏపీ అధికారపక్షం ఏ తీరులో స్పందిస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/