ఏపీలో మొన్నటి ఎన్నికల తర్వాత జరిగిన అధికార మార్పిడి.. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల మంటలను రేపిందనే చెప్పాలి. అప్పటిదాకా అధికారంలో ఉండి విపక్షంగా మారిన టీడీపీ... అధికార పార్టీగా మారిన వైసీపీలో తనదైన శైలిలో విరుచుకుపడుతోంది. టీడీపీ ఆరోపణలపై వైసీపీ కూడా కాస్తంత త్వరితగతిననే రియాక్ట్ అవుతున్నా... సీఎం జగన్ స్థాయి నేతలు అంతగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో వైసీపీకి చెందిన కీలక నేతలుగానే ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్ లుగా గుర్తింపు సాధించిన ఆర్కే రోజా - అంబటి రాంబాబు - ఆళ్ల రామకృష్ణారెడ్డి తరహా నేతలు టీడీపీపై తమదైన శైలి పవర్ పంచ్ లు సంధిస్తున్నారు. ఈ తరహా పంచ్ మరొకటి టీడీపీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై పడింది. ఆ పంచ్ ను బాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన నగరి ఎమ్మెల్యే - ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజానే సంధించారు.
విశాఖ జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాల జీవోల రద్దు విషయంపై రేగిన రచ్చ సందర్బంగా రోజా నుంచి వచ్చిన పడిన ఈ పంచ్ మామూలు పంచ్ కాదనే చెప్పాలి. అయినా ఈ సందర్భంగా బాబును రోజా ఏమన్నారన్న విషయానికి వస్తే.. బాబుకు పిచ్చి ముదిరిందని రోజా తనదైన శైలి సెటైర్ సంధించారు. బాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామని చంద్రబాబు చెబుతున్న విషయాన్ని ప్రస్తావించిన రోజా... బాబు అండ్ కో చెసే విమర్శలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం ఇవ్వకుండా ముందుకు వెళుతుంటే... బాబు పిచ్చెక్కి పోతున్నారని సంచలన వ్యాఖ్య చేశారు. సీఎం తన పని తాను చేసుకుని పోతుంటే... చంద్రబాబుకు నిజంగానే పిచ్చి ముదిరిందని రోజా వ్యాఖ్యానించారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి 2015లో చంద్రబాబు సర్కారు ఆరు జీవోలను ఇస్తే... వాటిని రద్దు చేస్తానని జగన్ తన పాదయాత్రలో గిరిజనులకు హామీ ఇచ్చిన విషయాన్ని రోజా గుర్తు చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న జగన్... బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారని, ఆ క్రమంలో బాబు జారీ చేసిన ఆరు జీవోలను రద్దు చేశారని రోజా గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాల జీవోలను తామే రద్దు చేశామని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా ఆ తవ్వకాల నేపథ్యంలో గిరిజన ఎమ్మెల్యే - మాజీ ఎమ్మెల్యే హత్యలకు కూడా కారణమైన చంద్రబాబు... బాక్సైట తవ్వకాలను రద్దు చేశానని చెబుతుంటే... ఆయనను ఏ పచ్చి ఆసుపత్రిలో చేర్చాలని కూడా రోజా కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. మొత్తంగా బాబుకు పిచ్చి ముదిరిందని, ఆయనను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలంటూ రోజా సంధించిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.