జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ గాలితీసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి సీటు కోసం ఢిల్లీలో కూర్చుకున్నారని రోజా ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో అసలు జనసేన ఉనికే లేదని రోజా ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం తమదేనని రోజా ధీమా వ్యక్తం చేశారు. జనసేనను ప్రజలు పట్టించుకోవడం మానేశారని రోజా అన్నారు. హైదరాబాద్‌లో పోటీ నుంచి తప్పుకున్నందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనకు సీటు కావాలని అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన పార్టీ పెట్టిన పనన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని గెలిపించాలన్నారని.. వేరే పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేవాళ్లు పార్టీ ఎందుకు పెట్టాలని రోజా ప్రశ్నించారు.
అక్కడ కేసీఆర్, జగన్‌ను ఎలాగైనా తొక్కేసి సీట్లు కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. బీజేపీకి తెలంగాణలో పట్టు ఉందేమో.. ఏపీలో అసలు సీటు వచ్చే పరిస్థితి లేదని రోజా అన్నారు. ఎవరు గెలిస్తే తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.. ఇవన్నీ చూస్తుంటే ప్రజల పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. జగన్ పాలన చూసి తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలు వైఎస్సార్‌సీపీని గెలిపిస్తారని ధీమాను వ్యక్తం చేశారు.