‘బిగ్ బాస్’ షో చాలామంది జీవితాల్ని మార్చేసింది. అంతకుముందు అనామకుల్లా ఉన్నవాళ్లు సెలబ్రెటీలు అయిపోయారు. రెండో సీజన్ కోసం ఎంపిక చేసిన సామాన్య పోటీదారుల్లో ఒకడైన రోల్ రైడా ఈ షోతో మంచి పాపులారిటీ సంపాదించాడు. అప్పటికే అతను రాపర్ గా కొనసాగుతూ.. కొన్ని పాటలతో సామాజిక మాధ్యమాల్లో ఆదరణ సంపాదించినప్పటికీ ఈ షోతో వచ్చిన పాపులారిటీ వేరు. దీన్ని తన కెరీర్ కోసం బాగానే ఉపయోగించుకుంటున్నాడు రోల్ రైడా. అతను తెలంగాణలో అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను ఈ పార్టీ కోసం పాటలు రూపొందిస్తుండటం విశేషం.
తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచన మేరకు అతను తన పాటలతో రంగంలోకి దిగాడు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల అమలు.. ప్రభుత్వ విజయాల్ని కొనియాడుతూ అతను తనదైన శైలిలో ఒక పాట రూపొందించాడు. మామూలు మాటలతోనే రాప్ గా మార్చి ఫన్నీగా పాటలు రూపొందించడం రోల్ రైడా శైలి. అతను గతంలో కిరాణా దుకాణంలో వస్తువుల గురించి వాకబు చేస్తూ పాడిన ఒక రాప్ సూపర్ పాపులరైంది. అదే తరహాలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోసం రాప్ సాంగ్ రూపొందించాడు. ఈ పాట ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రోల్ తో ఇలాంటి పాటలు మరిన్ని రూపొందించుకుని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
Read Here : https://www.youtube.com/watch?v=T0VmHNHNY-0