గుజరాత్‌ వాడి తెలివి; మోడీ ఇమేజ్‌తో ''క్యాష్‌''

Update: 2015-04-07 08:50 GMT
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశానికి చెందిన వారు ఉంటారని చెబుతారు. అలాంటి వారిలో కచ్ఛితంగా ఒక గుజరాతీ గ్యారెంటీ అని చెబుతారు. వ్యాపారాన్ని తమ నరనరాల్లో ఉండే గుజరాతీలు క్షణం ఖాళీ ఉండరు. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వ్యాపారంగా మార్చేస్తుంటారు.

తాజాగా గుజరాత్‌ సర్కారు కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రధాని మోడీ ఇమేజ్‌ని భారీగా పెంచేయటమే కాదు.. ఆయన పేరుతో డబ్బును సంపాదిస్తోంది. జనవరిలో నిర్వహించిన వైబ్రైంట్‌ గుజరాత్‌ కార్యక్రమం సందర్భంగా ''ఏ రైజ్‌ ఫ్రం మోదీస్‌ విలేజ్‌'' గుజరాత్‌ పర్యాటక శాఖ ఒక ప్యాకేజీని సిద్ధం చేసింది. రూ.600 చెల్లిస్తే.. గుజరాత్‌లో మోడీ పూర్వీకుల గ్రామానికి తీసుకెళ్లటం.. ఆయన చిన్నతనంలోమొసలిని పట్టుకున్న ప్రాంతంతోపాటు.. టీ అమ్మిన రైల్వే స్టేషన్‌.. డ్రమ్స్‌ వాయించిన ప్రాంతం.. చదువుకున్న స్కూలు.. నాటకాలు వేసిన హైస్కూలు.. ఇలా ఒకటేమిటి మోడీ బాల్యానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాల్ని ఈ ప్యాకేజీ కింద కవర్‌ చేస్తారు.

ఏమో అనుకున్నారు కానీ.. ఈ ప్యాకేజీన బ్రహ్మండంగా సక్సెస్‌ అయ్యిందట. గాంధీనగర్‌.. అహ్మాదాబాద్‌ నగరాల నుంచి మొదలయ్యే ఈ ప్యాకేజీకి ఆదరణ భారీగా ఉందని చెబుతున్నారు. ఈ ప్యాకేజీకి లభిస్తున్న ఆదరణ చూసిన గుజరాత్‌ సర్కారు త్వరలో మోడీ చిన్ననాటి స్నేహితులకూ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తోందట.

ఇక్కడ గుజరాత్‌ రాష్ట్రానికి సొమ్ములే కాదు.. మోడీ ఇమేజ్‌ను డబ్బులు తీసుకొని మరీ ప్రచారం చేస్తున్నట్లే. మొత్తానికి గుజరాత్‌ సర్కారు తెలివితేటలు చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్న మాట.
Tags:    

Similar News