ఆర్టీసీ సమ్మె: హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ కు దెబ్బేనా?

Update: 2019-10-11 10:01 GMT
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ ఇప్పుడు హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ గెలుపును ప్రభావితం చేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయట.. హుజూర్ నగర్ లోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. వారు ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ను ఓడించాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారట..

ఆర్టీసీ ఉద్యోగులు - వారి కుటుంబాలు.. వారి సన్నిహితులు కూడా టీఆర్ ఎస్ కు ఓటేసే పరిస్థితి హుజూర్ నగర్ లో లేదని అర్థమవుతోంది. ఈ పరిణామం టీఆర్ ఎస్ దెబ్బగానే అభివర్ణిస్తున్నారు.

ఏదైనా సమ్మె లేదా ఉద్యమ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అది హుజూర్ నగర్ లో కూడా ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేల మందికి పైగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నారు. వారి బంధువులు, అనుయాయులు. ఆర్టీసీ నేతల వ్యతిరేకత హుజూర్ నగర్ లోనూ ప్రతిధ్వనిస్తోందని సమాచారం.

టీఆర్ ఎస్ ఏకపక్ష పోకడలు.. ఒక పోటుతో 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్ తీసేసిన వైనంపై కూడా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం వారితో చర్చలు జరిపి ఒప్పించాలని.. వారు ఒప్పుకోకపోతే ఆ తర్వాత తీసేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కానీ గులాబీ దళపతి ఏకపక్షంగా తీసేయడం ప్రజల్లో వ్యతిరేకత కారణమవుతోందట.. అదే వ్యతిరేకత హుజూర్ నగర్ లో గులాబీ పార్టీకి మైనస్ గా మారుతోందట.. చూడాలి మరి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావం హుజూర్ నగర్ లో ఏమేరకు ఉందనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తెలిసే అవకాశం ఉంది.
   

Tags:    

Similar News